माओवादियों की गिरफ्तारी के बाद सामने आये खास बातें, पुलिस खंगाल रही है वो सच्चाई మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

हैदराबाद: आंध्र प्रदेश के एलुरु में माओवादियों की गिरफ्तारी के बाद पुलिस उस घर के आस-पास के लोगों से पूछताछ कर रही है, जहां वे रह रहे थे। इस पूछताछ में कई खास बातें सामने आ रही हैं। गिरफ्तार सभी माओवादियों ने केबल में काम करने की बात कहकर एक घर किराए पर लिया था।

माओवादी यह कहकर घर में रहने लगे थे कि वे हर महीने 10,000 रुपये किराया देंगे। वे काफी लोग थे। स्थानीय लोगों ने यह भी बताया कि उनमें से सिर्फ दो ही खाना लाने के लिए बाहर आते-जाते थे। बाकी सब घर पर ही रहते थे।

गांव वालों ने आगे बताया कि माओवादियों ने 26 अक्टूबर को घर किराए पर लिया था। इस मामले में पुलिस घर के मालिक से पूछताछ कर रही है। क्या माओवादी खुद घर की तलाश में आए थे? या कोई अन्य व्यक्ति बीच में आया था? अगर ऐसा है, तो बीच में आने वाला अन्य व्यक्ति कौन था।

18 नवंबर की सुबह अल्लूरी सीतारामराजू जिले के रम्पा चोडवरम जंगल इलाके में एक एनकाउंटर में माओवादी टॉप लीडर और सेंट्रल कमेटी मेंबर हिडमा, उसकी पत्नी राजे और कई माओवादी मारे गए। उसी दिन, पुलिस ने राज्य के अलग-अलग जिलों के मुख्य शहरों विजयवाड़ा, काकीनाडा और एलुरु में कुल 50 माओवादियों को गिरफ्तार किया। उन्हें कोर्ट में पेश किया गया। कोर्ट ने उन्हें हिरासत में भेज दिया है। इस मामले में पुलिस उनसे अहम जानकारी निकालने की कोशिश कर रही है।

यह भी पढ़ें-

మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

హైదరాబాద్ : ఏలూరులో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో వారు నివసించిన ఇంటి పరిసర ప్రాంతంలోని స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరంతా కేబుల్ పని చేస్తామంటూ ఇల్లు అద్దెకు దిగారు. నెలకు రూ. 10 వేలు చొప్పున అద్దె చెల్లిస్తామంటూ ఆ ఇంట్లోకి మావోయిస్టులు దిగారు. ఆ ఇంట్లో భారీగా మనుషులు ఉన్నా వారిలో ఇద్దరు మాత్రమే బయటకు వచ్చి ఆహారం తీసుకువచ్చే వారని స్థానికులు వెల్లడించారు. మిగిలిన వారంతా ఇంట్లోనే ఉండేవారని చెప్పారు.

అక్టోబర్ 26వ తేదీన మావోయిస్టులు ఇల్లు అద్దెకు తీసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టులు ఇల్లు వెతుక్కుంటూ స్వయంగా వారే వచ్చారా? లేకుంటే ఎవరైనా మధ్యవర్తిత్వం వహించారా? అలా అయితే ఆ మధ్యవర్తిత్వం వహించిన వాళ్లు ఎవరనే కోణంలో పోలీసులు ఆ ఇంటి యజమానిని ప్రశ్నిస్తున్నారు.

నవంబర్ 18వ తేదీ తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంప చోడవరం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, ఆయన భార్య రాజేతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. అదే రోజు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని ప్రధాన నగరాలు విజయవాడ, కాకినాడ, ఏలూరుల్లో మొత్తం 50 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X