బిసి ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతాము (More News From BRS)

హైదరాబాద్: బిసి ప్రజాప్రతినిధులు, నాయకులను కించపరిచే విధంగా విమర్శలు చేస్తే తగిన బుద్ది చెబుతామని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, శాసనమండలి చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ లు హెచ్చరించారు. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదర్శ నగర్ లోని MLA క్వార్టర్స్ లోని తన కార్యాలయంలో పలువురు బిసి ప్రజాప్రతినిధులు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా బిసి ప్రజాప్రతినిధులు, నాయకులపై ఇటీవల కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు, ఇతర నాయకులు చేస్తున్న విమర్శలను ముక్త కంఠం తో తో ఖండించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, యోగ్గె మల్లేశం, ఎల్.రమణ, బసవరాజ్ సారయ్య, శంభీపూర్ రాజు, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంపా గోవర్ధన్, MP లు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, బిబి పాటిల్, కార్పోరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ లతో పాటు ఇంకా పలువురు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రులు మాట్లాడుతూ బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బిసి లు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించే విధంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని అన్నారు. బిసి ల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే విధంగా బిసి కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములను కేటాయించడంతో పాటు నిధులను కూడా ఇచ్చిందని చెప్పారు.

అదేవిధంగా కులవృత్తులకు అనేక విధాలుగా చేయూతను అందిస్తూ వస్తుందని వివరించారు. అనేక విధాలుగా తమ ఎదుగుదలకు అండగా నిలిచినా BRS పార్టీ వెంట లు ఉన్నారని, దీన్ని జీర్ణించు కోలేక బిసి ల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. అధికారంలో ఉన్నంతకాలం బిసి లను కేవలం ఓటు బ్యాంకు గానే చూశారని, వారి అభివృద్దిని విస్మరించిందని విమర్శించారు. బీసీల జోలికొస్తే బీసీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. రాజకీయాలలో విమర్శ, ప్రతి విమర్శ సహజంగా ఉంటాయని, ఈ విధమైన వ్యక్తిగత, నోటికొచ్చిన పదాలను వాడటం సరైన విధానం కాదని హితవు పలికారు.

బిసి ప్రజాప్రతినిధులు, నాయకులపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వ్యక్తిగత, కుల వృత్తులను కించపరిచే విధంగా చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక పార్టీ విధానమా ? అనేది పార్టీ అధినాయకత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైఖరిని మార్చుకోకుంటే రానున్న రోజులలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకు గల అన్ని బిసి సామాజిక వర్గాలతో సమావేశం నిర్వహించి ఏకం చేస్తామని, త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ను రూపొందించి ప్రకటిస్తామని చెప్పారు.

మా ఓట్లతో గెలిచి మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. గ్రామాలలో తిరగనీయకుండా అడ్డుకుంటామని అన్నారు. బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతుందని ధ్వజమెత్తారు. తమ జోలికి వస్తే అన్ని బిసి సామాజిక వర్గాలు మూకుమ్మడిగా దాడి చేస్తాయని హెచ్చరించారు. బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకొని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.

130 సంవత్సరాల చరిత్ర తమ పార్టీది అని కాంగ్రెస్ నాయకులు గొప్పగా చెప్పుకోవడం కాదని, పార్టీ నాయకులు మాట్లాడే బాషను మార్చుకోవాలని, అలాంటి వారిపై పార్టీ ఎందుకు చర్యలు తీసుకోదని ప్రశ్నించారు. బిసి లు అంటే అసమర్ధులు అనుకోవద్దని, తాము బాద్యతాయుతమైన పదవులలో ఉన్నందున హుందాగా నడుచుకుంటున్నామని పేర్కొన్నారు. తమను తక్కువ అంచనా వేయవద్దని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే ఎంతవరకైనా వెనుకాడబోమన్నారు. బిసి లు జనాభాలో 56 శాతం ఉన్నారన్న విషయాన్ని మరచిపొవద్దని, రానున్న రోజులలో మా సత్తా ఏంటో చూపిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.

మ‌హిళ‌ల‌ను ఆర్థికంగా బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యం

యువ‌త‌ కొరకే ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా

పార్టీని మరోసారి అధికారంలోకి తేవాలి

పెద్ద వంగరలో కుట్టు శిక్ష‌ణ కేంద్రం సంద‌ర్శ‌న‌

మండల పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం

ఎర్రబెల్లి ట్రస్ట్ ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళా సంద‌ర్శ‌న‌

ఉచిత కరెంట్ మీద కాంగ్రెస్ వైఖరి పై మండిపాటు

కొడకండ్లలో రైతు సమావేశంలో పాల్గొన్న మంత్రి

పాలకుర్తి నియోజకవర్గ0లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేసిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

పెద్ద వంగర: మ‌హిళ‌లు ఆర్థికంగా ఎదిగితేనే, ఆ కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుప‌డుతుంద‌ని, అందుకే సీఎం కెసిఆర్ ఆశీస్సుల‌తో ప్ర‌భుత్వం, తాను కూడా మ‌హిళ‌ల ఆర్థిక అభివృద్ధి కోస‌మే పాటుప‌డుతున్నామ‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం, పెద్ద వంగర మండ‌లంలో మంత్రి ఎర్ర‌బెల్లి శ‌నివారం సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్ద వంగర మండ‌ల కేంద్రంలో నిర్వ‌హిస్తున్న కుట్టు శిక్ష‌ణా కేంద్రాన్ని ప‌రిశీలించారు. శిక్షణ పొందుతున్న మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. శిక్షణ ఎలా జరుగుతున్నది? తెలుసుకున్నారు. వారితో కలిసి ఫోటోలు దిగారు.

ఆ తరువాత పార్టీ కార్యాలయంలో మండల పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై జరుగుతున్న అభివృద్ది పనులపై చర్చించారు. అభివృద్ధి పనుల వేగం పెంచాలని చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకోవాలి అని సూచించారు. అలాగే అక్కడే ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను సందర్శించారు. యువతతో మాట్లాడారు. డ్రైవింగ్ మేళా కు స్పందన ఎలా ఉందంటూ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మేళా జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు.

ఆయా చోట్ల వేర్వేరుగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, మ‌హిళ‌లు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం స‌హా, దేశం బాగుప‌డుతుంద‌న్నారు. స‌హ‌జంగా మ‌హిళ‌ల్లో పొదుపు, మ‌దుపు, నిర్వ‌హ‌ణ అద్భుతంగా ఉంటాయ‌ని చెప్పారు. అందుకే సిఎం కెసిఆర్ మ‌హిళా సాధికార‌త మీద ప్ర‌త్యేక దృష్టి సారించార‌న్నారు. పేదరిక నిర్మూల‌న సంస్థ ద్వారా, స్త్రీ నిధి సంస్థ ద్వారా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు పావ‌లా వ‌డ్డీ, వ‌డ్డీలేని, బ్యాంకు లింకేజీ రుణాలు అంద‌చేస్తున్నామ‌న్నారు. మ‌హిళ‌ల రిక‌వ‌రీ బాగుండ‌టం వ‌ల్ల బ్యాంకులు కూడా ఎంత అడిగితే అంత మ‌హిళ‌ల‌కు ఇస్తున్నార‌న్నారు.

అలాగే, రాష్ట్రంలోనే మొద‌టిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన ఉచిత కుట్టు శిక్ష‌ణ‌, ఉచితంగా కుట్టు మిష‌న్‌ల పంపిణీ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. రూ.5 కోట్ల నిధుల‌తో 3 వేల మందికి ఈ శిక్ష‌ణ ఇస్తున్నామ‌ని, ఈ విడ‌త పూర్తి కాగానే, మిగ‌తా 7 వేల మందికి ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా శిక్ష‌ణ ఇస్తామ‌ని, మిష‌న్లు కూడా పంపిణీ చేస్తామ‌ని చెప్పారు. శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వారికి వ‌రంగ‌ల్ టెక్స్ టైల్ పార్క్ లో ఉపాధి, ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌న్నారు. క‌నీసం 10వేల మంది అవ‌స‌రం ఉంద‌ని, ఇప్ప‌టికిప్పుడు శిక్ష‌ణ పూర్తి చేసుకున్న వాళ్ళ0ద‌రికీ దాదాపు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని మంత్రి ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

ఇక ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత డ్రైవింగ్ లైసెన్స్ మేళాను యువత, అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ప్రమాదాలకు తావు లేని విధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి మంత్రి యువతకు ఉద్బోధించారు. డ్రైవింగ్ ఈ మేళా ద్వారా అందరూ లబ్ది పొందాలనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, జరుగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో మ‌హిళ‌లు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు, యువత పాల్గొన్నారు.

రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా మన టిఎస్ ఆర్టీసీ సంస్థ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలి.!

భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దు..

వారం రోజులపాటు వాతావరణ శాఖ అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా డ్రైవర్లందరూ పాటించవలసిన టిఎస్ ఆర్టిసి సంస్థ భద్రత సూక్తులు..

గౌరవ టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు పలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచనలు జారీ చేశారు.

హైదరాబాద్: మన ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలించింది. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకున్న మన టిఎస్ ఆర్టిసి సంస్థకు ఉంది. కాగా సుశిక్షుతులైన డ్రైవర్లు కలిగి ఉన్న సంస్థ ఆర్టీసీ సంస్థ. వర్షాకాలంలో డ్రైవర్ సోదరులు మరోసారి భద్రతా నియమాలను మననం చేసుకుని తూ.చ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరం ఉందని – గౌరవ టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలియజేశారు. ప్రస్తుతo తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా డ్రైవింగ్ సోదరులకు అత్యవసర ఉత్తర్వులను జారీచేసిన సంస్థ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు..

 1. వర్షం కురుస్తున్నప్పుడు వేగనియంత్రణ పాటించవలెను.
 2. మలుపుల వద్ద ఇండికేటర్ ను ఉపయోగించవలెను.
 3. ముందు వెళ్ళే వాహనముతో సురక్షిత దూరాన్ని పాటించవలెను.
  దట్టమైన వర్షం ఉన్నచోట హారన్ వాడవలెను.
 4. వర్షం కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయునపుడు వైపర్ వాడవలెను.
  హెడ్ లైట్ ను lowbeam లో మరియు ఫాగ్ lights తప్పనిసరిగా వాడవలెను. వైపర్లను కండిషన్లో ఉంచుకోగలరు.
  బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లవలెను.
 5. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపవలెను.
  నదులు కల్వర్టులు ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాటవేసే ప్రయత్నం చేయవద్దు.
 6. Windscreen గ్లాసులను వైపర్ తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్ తో శుభ్రపరచవలెను.
 7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ళతో ముఖంకాళ్ళు చేతులు శుభ్రపరుచుకొనవలెను.
 8. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించవలెను.
  డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకొనవలెను.
 9. దట్టమైన వర్షం ఉన్న సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు.
 10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. వర్షం పడుతున్నప్పుడు తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి.
 11. వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో Wrong Route లో వెళ్లరాదు.
 12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు.
 13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు.
 14. అతివేగంగా బస్సును నడపరాదు.
 15. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్ గా ఇండికేటర్ వేయకూడదు.
 16. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు అతి వేగం తో డ్రైవింగ్ చేయరాదు.
 17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి.
 18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడవకూడదు.
 19. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి.
  నగరంలో మ్యాన్ హోల్స్ మరియు రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సహాయంతో వాహనాన్ని నడపగలరు.
 20. బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ఫుట్ బోర్డు లో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి.
 21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కడం జరుగుతుంది.
  దీని ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
  వారి యొక్క గమ్య స్థానం లోనే కండక్టర్, డ్రైవర్ గారు ఆపగలరు, బస్సులోకి చేర్చుకోగలరు.
 22. చరవాణి మాట్లాడుతూ, మరియు ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు.
 23. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు.
 24. తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదు.

ఎంతో పేరున్న మన ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రైవరు మరియు కండక్టర్ గార్లు సురక్షితంగా బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సూచనలు జారీ చేశారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి గొప్పగా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండూనూరేళ్లు జీవించాలి:ఎంపీ రవిచంద్ర

ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి శ్రీశైల క్షేత్రం సందర్శన

మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు

కేసీఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి కావాలి, దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలి:ఎంపీ రవిచంద్ర

హైదరాబాద్: తెలంగాణతో పాటు దేశం సుభిక్షంగా వర్థిల్లాలి అని కోరుతూ ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర తాను పోరాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రాన్ని అన్ని విధాలా గొప్పగా అభివృద్ధి చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిపిన మహానేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని వేడుకున్నారు.ఎంపీ రవిచంద్ర బుధవారం తెల్లవారుజామున తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న వారికి వేద పండితులు మంగళవాయిద్యాలు, పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర-విజయలక్మీ, వద్దిరాజు దేవేందర్-ఇందిరమ్మ, వద్దిరాజు వెంకటేశ్వర్లు-ఉమా మహేశ్వరి దంపతులు మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవీలకు గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే యావత్ దేశం,ప్రజలు సుభిక్షంగా వర్థిల్లాలని, కేసీఆర్ మూడవ సారి తిరిగి ముఖ్యమంత్రి కావడమే కాక దేశ రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించాలని కోరుతూ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవీలను వేడుకున్నారు.ఎంపీ రవిచంద్ర,వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు వేద పండితులు ఆశీర్వచనాలు పలికి,తీర్థ ప్రసాదాలు అందజేశారు, శాలువాలతో సత్కరించారు.అలాగే,ఎంపీ వద్దిరాజు వెంట ఆయన సిబ్బంది మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

  Archives

  Categories

  Meta

  'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

  X