“బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఉంది, అందుకే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓడిపోయింది”

హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం మెదక్ జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులతో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మాత్రమే బీఆర్ఎస్ ఉందని అందుకే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓడిపోయిందని విమర్శలు చేశారు.

కవిత మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా మానేసి ప్రజల్లోకి రావాలని సూచించారు. బీఆర్ఎస్ కేడర్ వేలమంది తమతో టచ్‌లో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేతలు జగదీశ్‌రెడ్డి, మదన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు గతంలో ఎలా ఉండేవారని ఇప్పుడు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నల వర్షం కురిపించారు. తామే ప్రధాన ప్రతిపక్షంగా పనిచేస్తామని ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారని కానీ కేడర్‌ను మాత్రం పెంచుకోలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ఫూర్తితోనే తాము ప్రజల కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాట్లాడతూ, “బీఆర్ఎస్‌కు చెందిన పెద్ద రైతుల కోసం చిన్న రైతులను బలిచేస్తున్నారు. హరీశ్‌రావు ఫాంహౌజ్ ఆ సమీపంలో ఉండటంతోనే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చారని రైతులు చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, నవీన్ రావు ఓ ల్యాండ్ కోసం ఆర్ఆర్ఆర్ అలైన్‌మెంట్ మార్చారు. వీళ్లు చేసే అరాచకాల వల్లే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. వీరంతా కేసీఆర్‌ను తప్పుదోవ పట్టించి అక్రమాలకు పాల్పడ్డారు. నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కౌడిపల్లి ఎస్టీ బాలుర వసతి గృహం పేరిట రూ 1.5 లక్షల కిరాయి వస్తోంది.‌ ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ హాస్టల్‌ను మార్చాలి. ఆర్ఆర్ఆర్‌లో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ. కోటి ఇవ్వాలి. లేదంటే భూమికి భూమి ఇవ్వాలి” అని కవిత సూచించారు.

కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, “కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు ఉన్నారని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు. ఎత్తు పెంచితే కొల్చారం, పాపన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో భూములు పోతున్నాయి. మెదక్‌ జిల్లాలో అభివృద్ధి దారుణంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఉద్యమ కారులను ఏనాడూ పట్టించుకోలేదు. మెదక్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలపాలి. మెదక్‌లో ఎలాంటి సౌకర్యాలు లేవని మెడికల్ సీట్లను సీఎం రేవంత్‌రెడ్డి తన స్వగ్రామం కొడంగల్‌కు తీసుకెళ్లారు. మెదక్ జిల్లాలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత ఇబ్బంది పడుతోంది” అని కవిత విమర్శించారు.

Also Read-

కవిత మాట్లాడుతూ, “కాళేశ్వరం ద్వారా మెదక్ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి ఒక్కచుక్క కూడా నీళ్లు రాలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి 12 ఏళ్లు అయినా మెదక్ జిల్లా ప్రజల బతుకులు మారలేదు. జిల్లాలో జరిగే అరాచకాలు కేసీఆర్‌కు తెలియవు. సామాజిక తెలంగాణ సాధనే మా లక్ష్యం. గ్రూప్ వన్ ఉద్యోగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోంది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొంత అభివృద్ధి జరిగింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏమి చేయలేదు. హరీశ్‌‌రావు బినామీలు, వారి కంపెనీలతో సీఎం రేవంత్‌రెడ్డికు సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో ప్రశ్నించే శక్తిగా జాగృతి పనిచేస్తోంది” అని కవిత ఉద్ఘాటించారు. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X