కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఉదారత, 10వ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజు కట్టాలని నిర్ణయం

హైదరాబాద్/న్యూఢిల్లీ : విద్యార్థుల చదువు, వారికి కనీస సదుపాయాలు కల్పించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి.. విద్యార్థుల పట్ల తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులపై ఫైనల్ పరీక్ష ఫీజు భారం పడకుండా.. తానే ఆ ఫీజును చెల్లించేందుకు ముందుకొచ్చారు.

ఈ మేరకు.. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి దాసరి హరిచందనకు కేంద్రమంత్రి లేఖ రాశారు. ‘ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదనేది నా అభిమతం. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇచ్చిన అంత్యోదయ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పదో తరగతి పిల్లలకు నా వంతుగా సహాయం చేయాలని అనుకుంటున్నాను. అందుకే, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులందరికీ తెలంగాణ SSC బోర్డు పరీక్ష ఫీజు మొత్తాన్ని నా జీతం నుంచి చెల్లించాలని నిర్ణయించాను. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకోవాలని మస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. గత కొన్నేళ్లుగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల్లో మౌలికవసతుల కల్పన, విద్యార్థులకు అవసరమైన వస్తువుల పంపిణీ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, మెకనైజ్‌డ్ టాయిలెట్ క్లీనింగ్ మెషీన్స్ అందజేస్తున్నారు. దీంతోపాటుగా.. డబుల్ డెస్క్ బెంచీలను కూడా కిషన్ రెడ్డి సమయానుగుణంగా అందజేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో.. నోట్ బుక్స్ పంపిణీ చేస్తున్నారు. పలు పాఠశాలల్లో డిజిటల్ క్లాస్‌రూమ్స్ కు కూడా కేంద్రమంత్రి సహకారం అందించిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు అందిస్తున్న సహకారంలో భాగంగా.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల ఫైనల్ ఎగ్జామ్ ఫీజును పార్లమెంటు సభ్యుడిగా అందుకుంటున్న వేతనం నుంచి చెల్లించాలని నిర్ణయించారు.

Also Read

కోల్ పీఎస్‌యూల అర్ధవార్షిక సమీక్ష సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని అశోక హోటల్ లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గతేడాది భారత బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చేసింది. ఈసారి కూడా ఆ రికార్డులను అందుకోవడమే కాకుండా అంతకు మించిన ప్రగతిని ఈ ఆర్థిక సంవత్సరంలోనూ చేధించాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 5 నెలల సమయం మిగిలి ఉంది కాబట్టి.. ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలి. మరీ ముఖ్యంగా ఉత్పత్తి విషయంలో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకెళ్లాలి.

ఈసారి వర్షాల కారణంగా ఉత్పత్తికి అంతరాయం కలిగింది. దీన్ని అర్థం చేసుకోగలం. కానీ తర్వాత పుంజుకుని ఉత్పత్తిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. దీనిపై అన్ని సబ్సిడరీల సీఎండీలు చొరవతీసుకోవాలి. పరిస్థితిలో మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఏడాదికేడాది ఉత్పత్తి, రెవెన్యూ విషయంలో పురోగతి సాధించాలి. ఈ విషయంలో రాజీ పడొద్దు.

వచ్చే మూడున్నరేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం సంస్కరణల ఆధారంగానే నడవాలి. అందుకోసం అన్ని మంత్రిత్వ శాఖలు ప్రత్యేక వ్యూహంతో పనిచేస్తున్నాయి. మనం కూడా వీలైనన్ని సంస్కరణలు తీసుకొచ్చి బొగ్గు రంగాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలి. మన వద్ద ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్.. వంటి అత్యాధునిక వ్యవస్థ ఉంది. కానీ మనం దీన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. సాంకేతికతను వాడుకుంటూ.. వ్యవస్థను మరింత సరళంగా, ఫలితాలు సాధించేలా మార్చుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది.

ప్రతి సబ్సిడరీ కూడా.. ఇతర సబ్సిడరీలో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను తెలుసుకుని అమలు చేయాలి. అంతర్జాతీయంగా ఉన్న ఉత్తమ పద్ధతులను పాటించాలి. మనం తీసుకున్న చిన్న నిర్ణయం కారణంగా.. ఇవాళ కోటి రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని మన ఉద్యోగులకు, మన కార్మికులకు అందిస్తున్నాం. ఇదే విధంగా మరిన్ని కొత్త నిర్ణయాలతో.. మంచి మార్పులు తీసుకొచ్చే దిశగా కృషిచేయాలి.

CMPDI (Central Mine Planning and Design Institute Limited) ఓవర్ బర్డన్ టెస్టింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నిరంతరం శాంపిల్ టెస్టింగ్ చేస్తూ.. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉత్పత్తిపై పనిచేయాలి. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సానుకూలంగా స్పందిస్తూ.. మనకు వెంటవెంటనే అనుమతులు ఇస్తోంది. ఈ విషయంలో మరేమైనా సమస్యలున్నా వెనువెంటనే పరిష్కరించుకునే అవకాశం ఉంది.

కోల్ వాషరీస్ విషయంలో మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. వాషరీస్‌తో క్వాలిటీ పెరుగుతుంది. బొగ్గు దిగుమతులు తగ్గుతాయి. అందుకే దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలి. సబ్సిడరీ లెవల్లో.. సబ్ కమిటీలను ఏర్పాటుచేసి కార్యాచరణ ప్రారంభించాలి. కార్మికుల సంక్షేమం, వారి ఆరోగ్య సంరక్షణ విషయంలో.. రాజీపడొద్దు. దీంతోపాటుగా.. UPSC విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించే విషయంలో.. ప్రత్యేక చొరవ తీసుకోవాలి. మైన్ క్లోజర్ విషయంలో.. ప్రత్యేక సెల్ ఏర్పాటుచేయాలి. మైన్ క్లోజర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. మూడేళ్లలో 141 డీకోల్డ్ మైన్స్‌ను మూసేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ విషయంలో రాజీ పడకుండా సీఎండీలు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలి.

ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, బొగ్గు శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్, కోలిండియా చైర్మన్, బొగ్గు శాఖ అదనపు కార్యదర్శి సనోజ్ కుమార్ ఝా, అదనపు కార్యదర్శి శ్రీమతి రూపిందర్ బ్రార్, మంత్రిత్వ శాఖ అధికారులు, సబ్సిడరీల సీఎండీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X