हैदराबाद: जिला चुनाव अधिकारी आर. वी. कर्णन ने बताया कि जुबली हिल्स उपचुनाव में 4,01,365 मतदाता अपने मताधिकार का प्रयोग करेंगे। उन्होंने बताया कि ईवीएम सोमवार को कोटला विजयभास्कर रेड्डी स्टेडियम से मतदान केंद्रों के लिए पहुँचाई जाएँगी। इस बार, प्रत्येक मतदान केंद्र पर 4 बैलेट यूनिट होंगी। 139 मतदान केंद्रों पर 407 मतदान केंद्र बनाए गए हैं। मतदान केंद्रों के पास तीन चरणबद्ध सुरक्षा व्यवस्था होगी। उन्होंने बताया कि निर्वाचन क्षेत्र में 45 एफएसटी और 45 एसएसटी टीमें काम कर रही हैं।
कर्णन ने बताया कि मतदान केंद्रों पर 2,060 कर्मचारी तैनात रहेंगे। 561 कंट्रोल यूनिट, 595 वीवीपैट और 2,394 बैलेट यूनिट उपलब्ध होंगी। मतदान केंद्रों से लाइव वेबकास्टिंग की जाएगी। मतदान केंद्रों पर हेल्प डेस्क और मोबाइल डिपॉज़िट काउंटर स्थापित किए जा रहे हैं। एनसीसी के स्वयंसेवक भी मतदाताओं की कतार बनाए रखने का काम करेंगे। पूरी चुनाव प्रक्रिया पर ड्रोन के ज़रिए नज़र रखी जाएगी।
कर्णन ने कहा कि उन्होंने चुनावों के संदर्भ में फ़ोन-पे और गूगल-पे के ज़रिए मतदाताओं को पैसे भेजे जाने के मुद्दे पर आरबीआई से चर्चा की है। आरबीआई इस सीमा तक ऑनलाइन भुगतान पर नज़र रखेगा। आज से 11 तारीख की शाम तक शराब की दुकानें बंद रहेंगी। कर्णन ने सभी मतदाताओं से आगे आकर उपचुनावों के संदर्भ में अपने मताधिकार का प्रयोग करने की अपील की।
इसी क्रम में, संयुक्त पुलिस आयुक्त तफ़सीर इकबाल ने बताया कि 65 स्थानों पर 226 संवेदनशील मतदान केंद्रों की पहचान की गई है। संवेदनशील मतदान केंद्रों पर अर्धसैनिक बलों की तैनाती की जाएगी। सभी मतदान केंद्रों पर पुलिस तैनात रहेगी। चुनाव नियमों के उल्लंघन के 27 मामले दर्ज किए गए हैं। अब तक 3 करोड़ 60 लाख रुपये नकद ज़ब्त किए गए हैं। पुलिस आयुक्त तफ़सीर इकबाल ने स्पष्ट किया कि 230 उपद्रवी तत्वों को बाउंड ओवर किया गया है।
यह भी पढ़ें-
Jubilee Hills By Poll: ఉప ఎన్నికకు సర్వం సిద్ధం, మూడంచెల బందోబస్తు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. రేపు(సోమవారం) రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని పేర్కొన్నారు. ఈసారి ఒక్కో పోలింగ్ స్టేషన్‌లో 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయన్నారు. 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బూత్‌ల దగ్గర మూడంచెల భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. 45FST, 45SST టీమ్స్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాయని వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల్లో 2,060 మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారని కర్ణన్ పేర్కొన్నారు. ఈ మేరకు 561 కంట్రోల్ యూనిట్లు, 595 వీవీ ప్యాట్లు, 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలింగ్ స్టేషన్స్ నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పారు. అలాగే పోలింగ్ స్టేషన్స్ వద్ద హెల్ప్ డెస్క్‌లు, మొబైల్ డిపాజిట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఓటర్లు క్యూ మెయింటెన్ చేయడానికి NCC వాలంటీర్లు కూడా పని చేయనున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ అంతా డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తామని వెల్లడించారు.
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపే అంశంపై RBIతో చర్చించినట్లు కర్ణన్ తెలిపారు. ఈ మేరకు ఆన్‌లైన్ పేమెంట్స్‌పై RBI నిఘా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే.. నేటి నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్లు వెల్లడించారు. ఉపఎన్నిక నేపథ్యంలో ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలని కర్ణన్ విజ్ఞప్తి చేశారు.
అనంతరం జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ 65 లొకేషన్స్‌లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించినట్లు తెలిపారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాల బందోబస్తు ఉంటుందన్నారు. అలాగే.. అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసులు 27 నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 60 లక్షల నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు. 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినట్లు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ స్పష్టం చేశారు. (ఏజెన్సీలు)
