Hyderabad: The Department of Journalism and Mass Communication, Dr B. R. Ambedkar Open University organizing a two-day national seminar on “Future of Journalism in the AI Era : Opportunities and Challenges” during 17 – 18 October 2025. The Hon’ble Vice-Chancellor Prof. Ghanta Chakrapani released the seminar broacher on Tuesday.
Prof. Chakrapani stated that over the past ten years, artificial intelligence has brought forth a number of technological advancements that have a significant influence on the media. The media has changed in a number of ways as a result. All facets of journalism are changing, including social media, fake news dissemination, journalist working conditions, media relations, and content.
The seminar will have broad sub-themes namely: AI in Film & Electronic Media; A and Machine Learning, AR and VR in Newsrooms; Cross media story telling – cultural, social and technological challenges; Current trends, Future, Global Perspective; From Headlines to DeepFakes: Navigating AI’s impact on Media Integrity; Journalism in the age of AI: Balancing innovation & Authenticity; and Impact of AI on Public Relations & Corporate Communication: Threats & Opportunities.
To give an impetus to the discussion, it is proposed to invite eminent professors and personalities who have immensely contributed to the field of journalism Media studies, Public Relations and Advertising, etc, apart from the resource persons, research contribution will be invited from the interested academicians in the field and other related departments/ organization.
Seminar Director & Dean, Faculty of Social Sciences Prof. Srinivas Rao Vaddanam, Registrar Dr. L Vijaya Krishna Reddy, Seminar Co-director Dr. Yadagiri Kambhampati, Coordinators Dr. Sunil Kumar Pothana, Dr. P. Venu Gopal Reddy, Controller of Examinations Prof. B. Srinivas, EMR&RC Director Prof. Ravindranath Solomon presented the event.
Also Read-
మీడియాపై కృతిమ మేథస్సు ప్రభావం
హైదరాబాద్ : మీడియాపై కృత్రిమ మేధస్సు గణనీయమైన ప్రభావాన్ని చూపే అనేక సాంకేతిక పురోగతినీ తీసుకొచ్చిందని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 17 – 18 తేదీల్లో “కృతిమ మేథస్సు యుగంలో జర్నలిజం భవిష్యత్తు: అవకాశాలు – సవాళ్లు” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సెమినార్ బ్రోచర్‌ను మంగళవారం వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి విడుదల చేశారు.
ప్రొఫెసర్ చక్రపాణి మాట్లాడుతూ గత పదేళ్లలో, మీడియాపై కృత్రిమ మేధస్సు గణనీయమైన ప్రభావాన్ని చూపే విధంగా అనేక సాంకేతిక పురోగతులను తీసుకొచ్చిందన్నారు. ఫలితంగా మీడియాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. సోషల్ మీడియా, ఫేక్ వార్తల వ్యాప్తి, జర్నలిస్ట్ నిబద్ధత, మారిన పరిస్థితులు, మీడియా సంబంధాలు, కంటెంట్‌తో సహా జర్నలిజంలోని అన్ని కోణాలు మారుతున్నాయని వెల్లండించారు.
ఈ సెమినార్‌లో ఫిల్మ్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎఐ; మెషిన్ లెర్నింగ్, న్యూస్‌రూమ్‌లలో ఏఆర్, విఆర్; క్రాస్ మీడియా స్టోరీ టెల్లింగ్ – సాంస్కృతిక, సామాజిక, సాంకేతిక సవాళ్లు; ప్రస్తుత ధోరణులు, భవిష్యత్తు, ప్రపంచ దృక్పథం; డీప్‌ఫేక్స్, మీడియా సమగ్రతపై ఎఐ ప్రభావం, ఎఐ యుగంలో జర్నలిజం: ఆవిష్కరణ – ప్రామాణికతను సమతుల్యం చేయడం; ప్రజా సంబంధాలు, కార్పొరేట్ కమ్యూనికేషన్‌పై ఎఐ ప్రభావం తదితర అంశాలపై చర్చించనున్నారు. జర్నలిజం రంగంలో విశేష అనుభవం కలిగి ఆ రంగంలో కృషి చేసిన ప్రముఖ ప్రొఫెసర్లు, వ్యక్తులను సెమినార్ కి ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల విద్యావేత్తలు, పరిశోధన విద్యార్థులు పరిశోధన పత్రాలను పంపించాలని సెమినార్ డైరెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్, సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ డీన్ ప్రొ. శ్రీనివాస రావు వడ్డాణం, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి, సెమినార్ కో-డైరెక్టర్ డా. యాదగిరి కంభంపాటి, కోఆర్డినేటర్లు డా. సునీల్ కుమార్ పోతన, డా. పి. వేణు గోపాల్ రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ. బి. శ్రీనివాస్, ఈఎం.ఆర్ .ఆర్.సి. డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ పాల్గొన్నారు.
