సన్న బియ్యం ప్రతి పేదవాడి గడపలో ఆనందం, సీఎం రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన లబ్ధిదారులు

సన్న బియ్యంతో వంట చేసి కార్పొరేటర్ కు వడ్డించిన వడ్డెర బస్తీ కి చెందిన రాజు సరిత కుటుంబం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సన్న బియ్యం లబ్ధిదారులు తీసుకొని తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సన్న బియ్యం తీసుకొని వాటితో భోజనం తయారు చేసి వడ్డెర బస్తికి చెందిన రాజు,సరిత దంపతులు స్థానిక కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించి వడ్డించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన సన్న బియ్యం పథకం ప్రతి పేదవాడి మూడు పూటల అన్నం తినగలుగుతారని లబ్ధిదారులు సరిత రాజు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో రకంగా సంక్షేమ ఫలాలను అందిస్తుందని కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

Also Read-

సన్న బియ్యం తో ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడగలుగుతున్నామని ఇది ప్రజా ప్రభుత్వం,ప్రజా పాలన ప్రభుత్వమని పేదవారిని ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆ విధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. దేశం గర్వించదగ్గ పథకాన్ని తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X