డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న నిరసనలు
హైదరాబాద్ : డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పది ఎకరాల స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఎఫ్.ఏ.యూ) కేటాయించొద్దని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. పది ఎకరాల స్థలం కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను నిరసిస్తూ, ఆ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని అంబేద్కర్ వర్షీటీ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మంగళవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆందోళనను కొనసాగించారు.
జేఎసీ కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఖాళీ స్థలమే లేదని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు కొత్తగా కంప్యూటర్ ల్యాబ్స్ నిర్మించే అవసరం ఉంది. నూతన విద్య విధానం ప్రకారం (నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (NEP-2020 ఎక్కువ మంది విద్యార్థులకు విద్యావకాశాలను అందించడానికి వివిధ కోర్సులు అందుబాటులోకి తీసుకోరావాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేఖను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా కొనసాగతున్న ఈ నిరసనను ప్రభుత్వం తన ఆలోచనా విధానాన్ని మార్చుకోకుంటే మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
Also Read-
ఈ కార్యక్రమంలో జేఎసీ నేతలు నేతలు అధ్యాపక, అధ్యాపకేతర, అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.