हैदराबाद: भारी बारिश और बाढ़ से बुरी तरह प्रभावित तेलुगु राज्यों को केंद्र सरकार ने बड़ी राहत दी है। तेलंगाना और आंध्र प्रदेश ने बाढ़ पीड़ितों के लिए तत्काल राहत उपायों के तहत बड़ी वित्तीय सहायता की घोषणा की है। केंद्रीय गृह मंत्री अमित शाह ने खुलासा किया कि दोनों राज्यों को 3300 करोड़ रुपये की तत्काल वित्तीय सहायता प्रदान की जा रही है।
केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने पिछले दो दिनों में भारी बारिश और बाढ़ के कारण गंभीर रूप से क्षतिग्रस्त हुए एपी के विजयवाड़ा और तेलंगाना के खम्मम इलाकों का दौरा किया और बाढ़ से हुए नुकसान का आकलन किया। मालूम हो कि प्रधानमंत्री नरेंद्र मोदी ने खुद तेलंगाना के सीएम रेवंत रेड्डी और एपी के सीएम चंद्रबाबू नायडू को फोन किया और दोनों राज्यों को हर तरह से समर्थन देने का वादा किया। ऐसा लगता है कि यह राशि तत्काल राहत उपायों के लिए घोषित की गई है।
यह भी पढ़ें-
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరద సహాయం
హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వరద బాధితుల తక్షణ సహాయక చర్యల కింద తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3300 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.
భారీ వర్షాలు, వరదల వలన తీవ్రంగా నష్టపోయిన ఏపీలోని విజయవాడ, తెలంగాణ లోని ఖమ్మం ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత రెండు రోజులుగా పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి రెండు రాష్ట్రాలను అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తక్షణ సహాయక చర్యల నిమిత్తం ఈ మొత్తాన్ని ప్రకటించినట్టు తెలుస్తోంది. (ఏజెన్సీలు)