हैदराबाद/चेन्नई : भारतीय महिला टीम ने दक्षिण अफ्रीका को 10 विकेट से हराया। चेन्नई के एमए चिदंबरम स्टेडियम में खेले गये एकमात्र टेस्ट मैच में जीत हासिल की। भारतीय महिला टीम को इस मैच की चौथी पारी में 37 रनों का टारगेट मिला था। इस लक्ष्य को शेफाली वर्मा और शुभा सतीश की ओपनिंग जोड़ी ने बिना किसी नुकसान के हासिल किया।
भारतीय महिला टेस्ट क्रिकेट इतिहास में दूसरी बार ऐसा हुआ है कि जब टीम ने किसी टेस्ट मैच को 10 विकेट से अपने नाम किया है। वहीं घर पर टीम इंडिया ने ये कारनामा दूसरी बार किया है। शेफाली वर्मा के बल्ले से दूसरी पारी में नाबाद 24 रन तो शुभा सतीश ने 13 रन बनाए।
इस मैच में टीम इंडिया ने पहले बल्लेबाजी करते हुए 603 रन बनाकर अपनी पारी को घोषित किया था। इसके बाद बल्लेबाजी करने उतरी साउथ अफ्रीकी महिला टीम अपनी पहली पारी में सिर्फ 266 रन बनाकर सिमट गई। भारत की तरफ से गेंदबाजी में स्नेह राणा का कमाल देखने को मिला। उन्होंने 25.3 ओवर्स में 77 रन देते हुए 8 विकेट अपने नाम किए।
यह भी पढ़ें-
साउथ अफ्रीकी टीम को फालोऑन का सामना करना पड़ा। इसमें उनकी तरफ से दूसरी पारी में बेहतर बल्लेबाजी प्रदर्शन देखने को मिला। हालांकि टीम इस मैच में अपनी हार को नहीं बचा सकी। अफ्रीकी टीम की तरफ से दूसरी पारी में सुने लुस ने 109 तो कप्तान वोल्वाडार्ट ने 122 रनों की पारी खेली। इसके दम पर टीम 373 रनों के स्कोर तक पहुंच सकी।
ఏకైక టెస్ట్‌లో టీమిండియా అమ్మాయిల గ్రాండ్ విక్టరీ
హైదరాబాద్/చెన్నై : టీ20 వరల్డ్ కప్ విజయంతో యావత్ దేశం ఉప్పొంగిపోతున్న వేళ సౌతాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇండియా విమెన్స్ క్రికెట్ కూడా అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సూపర్ షో చూపెట్టిన టీమిండియా 10 వికెట్ల తేడాతో ప్రొటీస్‌ను ఓడించింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 37 రన్స్ ఛేదన కోసం సోమవారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 9.2 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది.
ఓపెనర్లు శుభ సతీశ్ (13 బ్యాటింగ్), షెఫాలీ వర్మ (24 బ్యాటింగ్) ఈజీగా విజయాన్ని అందించారు. టెస్ట్‌ల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలవడం ఇది రెండోసారి. 2002 పార్ల్‌లో ప్రొటీస్‌పైనే తొలి విజయాన్ని నమోదు చేశారు. అంతకుముందు 232/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 154.4 ఓవర్లలో 373 రన్స్‌కు ఆలౌటైంది. లారా వోల్‌వర్త్ (314 బాల్స్‌లో 16 ఫోర్లతో 122), సునె లుస్ (203 బాల్స్‌లో 18 ఫోర్లతో 104) సెంచరీలతో రాణించినా ఇండియా విజయాన్ని అడ్డుకోలేకపోయారు. డిక్లెర్క్ (61) ఫర్వాలేదనిపించింది. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
105 రన్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికాను టీమిండియా బౌలర్లు అద్భుతంగా కట్టడి చేశారు. ఓ ఎండ్‌లో లారా ఒంటరిగా పోరాటం చేసినా రెండో ఎండ్‌లో వరుస విరామాల్లో వికెట్లు తీసి ప్రొటీస్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ముందుగా దీప్తి శర్మ (2/95).. మరిజానె కాప్ (31)ను ఎల్బీ చేయగా, ఆ వెంటనే స్నేహ్ రాణా (2/111) డెల్మి టకెర్ (0)ను పెవిలియన్‌కు పంపింది. దీంతో ప్రొటీస్ 266/4తో మరింత కష్టాల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ లారా యాంకర్ ఇన్నింగ్స్‌తో ఆధిక్యం కోసం పోరాడింది. కానీ 106వ ఓవర్‌లో రాజేశ్వరి (2/55) ఓ సూపర్ డెలివరీతో లారాను ఎల్బీ చేయడంతో స్కోరు 281/5గా మారింది. ఈ దశలో డిక్లెర్క్, సినాలో జాఫ్తా (15) కాసేపు బ్యాట్లు అడ్డేశారు.
ఈ క్రమంలో తొలిసారి ఇండియాపై సౌతాఫ్రికా 300 మార్క్‌ను అందుకుంది. 302/5తో లంచ్‌కు వెళ్లిన సఫారీలు రెండో సెషన్‌లో ఘోరంగా తడబడ్డారు. క్రాంప్స్ కారణంతో జాఫ్తా రిటైర్డ్‌హర్ట్ కావడంతో డెరెక్‌సెన్ (5) క్రీజులోకి వచ్చింది. వచ్చిన వెంటనే పూజా వస్త్రాకర్ (1/35) దెబ్బకు వికెట్ ఇచ్చుకుంది. అదే టైమ్‌లో సౌతాఫ్రికా టెస్ట్‌ల్లో అత్యధిక స్కోరు (316)ను నమోదు చేసింది. 2003లో ఇంగ్లండ్‌పై చేసిన 315 రన్స్‌ను అధిగమించింది. చివర్లో టుమి సుక్‌హనె (6), మసబటా క్లాస్ (2), మలాబా (1 నాటౌట్) ఫెయిలైనా, డిక్లెర్క్ వేగంగా ఆడటంతో ఇండియా ముందు 37 రన్స్ టార్గెట్‌ను ఉంచగలిగారు. (ఏజెన్సీలు)