तेलंगाना में अमानवीय घटना, आदिवासी महिला को किया निर्वस्त्र… हरी मिर्ची… और गुप्तांग में…

हैदराबाद : तेलंगाना में एक अमानवीय मामला घटना देर से प्रकाश में आया है। पिछले दस दिनों से तीन बदमाशों ने एक चेंचू समुदाय की महिला को एक घर में बंधक बना लिया और अंधाधुंध मारा-पीटा कि सभ्य समाज का सिर शर्म से झूक जाये। यह मामला बुधवार को प्रकाश में आया है। यह क्रूर कृत्य नागरकर्नूल जिले के कोल्हापुर मंडल के मोलचिंतपल्ली में हुआ है।

मीडिया में प्रसारित और प्रकाशित खबरों के मुताबिक है, नागरकर्नूल जिले के कोल्हापुर मंडल के मोलचिंतपल्ली स्थित चेंचू भ्रमरांबा कॉलोनी निवासी काट्रासु ईदन्ना और ईश्वरम्मा पति-पत्नी हैं। उनकी तीन बेटियां हैं। दस दिन पहले पति-पत्नी के बीच झगड़ा होने के कारण ईश्वरम्मा गांव छोड़कर चली गई थी। नतीजतन, पति ने गांव में अपने परिचितों से संपर्क किया और बताया कि उसकी पत्नी लापता है। हालांकि उसी के खेत को ठेके पर लेने वाले उसी गांव के निवासी बंडी वेंकटेश, बंडी शिवुडु और सलेश्वर को पता चला कि ईश्वरम्मा कहां पर छिपी है।

बदमाशों ने महिला को चुपचाप बाइक पर बिठाकर मोलचिंतापल्ली ले आते समय रास्ते में बेरहमी से पिटाई की और एक घर में बंध कर दिया। हालांकि ये बदमाश यहीं नहीं रुके और उन्होंने आदिवासी महिला ईश्वरम्मा के शरीर, आंखों और गुप्तांग पर हरी मिर्ची पीसकर डाल दिया। दुर्भाग्य की बात यह है कि पीड़ित महिला मिर्ची की जलन से चिल्लाती रही मगर आसपास के घरों के लोगों ने कोई प्रतिक्रिया नहीं दी। इन सबके बावजूद उसके पति ईदन्ना को अपनी पत्नी ईश्वरम्मा के ठिकाने के बारे में पता नहीं चल पाया था।

यह भी पढ़ें-

हैवानियत की यह करतूत बुधवार को तब सामने आई जब उसके पति ने गांववालों को बताया कि उसकी पत्नी पिछले दस दिनों से नहीं दिख रही है। यह निंदनीय है कि भरोसा करने वाले लोग ही इस तरह महिला को प्रताड़ित किया। इसी गांव के बंडी वेंकटेश और बंदी शिवुडु ने काट्रासु ईदन्ना की कृषि भूमि को ठेक पर ली है। ग्रामीणों ने कहा कि ठेकेदारों ने इस दंपत्ति को अपने ही खेत में काम पर रख लिया। पति-पत्नी के बीच झगड़े के कारण ईश्वरम्मा जैसे ही घर से बाहर निकल गई, इन बदमाशों ने उसके साथ अमानवीय व्यवहार किया।

नल्लामाला वन तटीय क्षेत्र में मोलचिंतपल्ली चेंचू भ्रमरम्बा कॉलोनी के काट्रासु ईश्वरम्मा के साथ उसी गांव के बंडी वेंकटेश, बंडी शिवुडु और सलेश्वरम द्वार किये जघन्य कृत के बारे में गांव के लोगों ने बुधवार शाम को पुलिस को इसकी जानकारी दी। कोल्हापुर पुलिस गांव पहुंची और असहाय पीड़िता ईश्वरम्मा को इलाज के लिए वाहन 108 से कोल्हापुर सरकारी अस्पताल पहुंचाया। वहां से उसे बेहतर इलाज के लिए नागरकर्नूल जिला अस्पताल में स्थानांतरित कर दिया गया।

कोल्हापुर एसएस हृषिकेश ने बताया कि इस मामले में शामिल कुछ लोगों को हिरासत में लिया गया है और जांच की जा रही है। वहीं इस मामले को लेकरआदिवासी चेन्चू समुदाय संगम के नेता गुरुवार को मोलचिंतपल्ली गांव आएंगे और चेंचू ईश्वरम्मा के लिए न्याय की मांग करेंगे।

తెలంగాణలో అమానవీయ ఘటన, మహిళను వివస్త్రను చేసి… మర్మాంగంలోనూ…

హైదరాబాద్ : తెలంగాణలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా ముగ్గురు దుర్మార్గులు గత పది రోజులుగా ఓ ఇంట్లో చెంచు మహిళను నిర్బంధించి విచక్షణ రహితంగా కొట్టి వాతలు పెట్టారు. ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. ఈ పాశవిక చర్య నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతపల్లిలో చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల చింతపల్లి లోని చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈదన్న ఈశ్వరమ్మలు భార్యాభర్తలు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో ఈశ్వరమ్మ ఊరు విడిచి వెళ్ళింది. దీంతో తన భార్య కనిపించడం లేదంటూ గ్రామంలో తనకు తెలిసిన వారితో భర్త వాకప్ చేశాడు. అయితే తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ బండి శివుడు సలేశ్వరంకు ఈశ్వరమ్మ తల దాచుకున్న సమాచారం తెలుసుకున్నారు.

సదరు దుర్మార్గులు రహస్యంగా బైకుపై మొలచింతపల్లి గ్రామానికి తీసుకొస్తూ మార్గమధ్యంలో చితకబాది ఓ ఇంట్లో నిర్బంధించారు. అయితే దుర్మార్గులు ఇంతటీ ఆగకుండా ఆదివాసి మహిళ ఈశ్వరమ్మను వివస్త్ర చేసి చిత్రహింసలకు గురిచేసి, ఆ తరువాత శరీరంపై వాతలు పెట్టి పచ్చికారం నూరి శరీరంపైన, కళ్ళలోనూ, మర్మాంగంలోనూ చల్లారు. ఆ మంటలకు తాళలేక బాధితురాలు రోదించినప్పటికీ చుట్టుపక్కల ఇళ్ల వారు స్పందించకపోవడం విచారకరం. అయితే ఇంత జరిగినప్పటికీ గాను తన భార్య ఈశ్వరమ్మ ఆచూకీ మాత్రం భర్త ఈదన్నకు తెలియ రాలేదు. తన భార్య గత పది రోజుల నుంచి కనబడడం లేదని భర్త ఈదన్న గ్రామస్తులకు తెలపడంతో ఈ పాశవీక చర్య ఆనోటా ఆనోటా బుధవారం బయటపడింది. నమ్మకస్తులే ఈ కిరాతకానికి పాల్పడడం శోచనీయం. కాట్రాసు ఈదన్నకు ఉన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్, బండి శివుడులు కౌలు తీసుకొన్నారు. అయితే సదరు కౌలుదారులు ఆ చెంచు దంపతులను తమ పొలం వద్దనే జీతం పెట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. భార్యాభర్తల గొడవ కారణంగా భార్య ఈశ్వరమ్మ ఇల్లు విడిచి వెళ్లడంతో సదరు దుర్మార్గులు ఇందులో తలదూర్చి కిరాతకానికి పాల్పడ్డారు.

నల్లమల అటవీ తీర ప్రాంతంలోని మొలచింతపల్లి చెంచు భ్రమరాంబ కాలనీకి చెందిన కాట్రాసు ఈశ్వరమ్మ, అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్, బండి శివుడు సలేశ్వరంల చేసిన దారుణ సంఘటనను గ్రామస్తులు పోలీసులకు బుధవారం సాయంత్రం సమాచారం అందించారు. దీంతో కొల్లాపూర్ పోలీసులు గ్రామానికి చేరుకొని నిస్సహాయ స్థితిలో ఉన్న బాధితురాలు ఈశ్వరమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు కొల్లాపూర్ ఎస్సై హృషికేష్ తెలిపారు. ఇది ఇలా ఉండగా మొలగింతపల్లిలో దుర్మార్గుల చేత అఘాయిత్యానికి గురైన చెంచు కాట్రాసు ఈశ్వరమ్మకు న్యాయం చేయాలని కోరుతూ ఆదివాసి చెంచుల సంఘం జిల్లా రాష్ట్ర నాయకులు గురువారం ములచింతపల్లి గ్రామానికి రానున్నట్లు సమాచారం. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X