ఈనెల 8న ఉదయం 9 గంటలకే మోదీ ‘‘విజయ సంకల్ప సభ’’

-15 లక్షల జన సమీకరణతో ఓరుగల్లును పోరుగల్లుగా మారుద్దాం

-కాంగ్రెస్ అనే కిరాణ దుకాణంలో కాస్ట్ లీ మెటీరియల్ చేరింది

-కేసీఆర్ దగ్గర కావాల్సినంత డబ్బుంది… ఆ పార్టీని కొనేందుకు సిద్ధమయ్యారు

– కాంగ్రెస్ రాష్ట్రంలో ఎక్కడుంది?

-దుబ్బాక నుండి టీచర ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే దక్కలే

-ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ సభ పాదయాత్ర ముగింపు సభనా? జాయినింగ్స్ సభనా? చెప్పుకోలేని దుస్థితి

-బీఆర్ఎస్ కు అసలు సిసలైన ప్రత్యామ్నాయం బీజేపీయే

-బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్లమెంట్ లోపల, బయటా కలిసే పనిచేస్తున్నాయి

కాంగ్రెస్ – బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్

హైదరాబాద్: ఈనెల 8న హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే బహిరంగ సభకు ‘‘విజయ సంకల్ప సభ’’ అని నామకరణం చేశారు. ఆరోజు ఉదయం 9 గంటలకే మోదీ హన్మకొండ సభకు విచ్చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. దాదాపు 15 లక్షల జన సమీకరణే లక్ష్యంగా బహిరంగ సభను నిర్వహించి ఓరుగల్లును పోరుగల్లుగా మార్చి చరిత్ర స్రుష్టిస్తామని చెప్పారు. కనివీనీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

• ప్రధాన బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈరోజు ఈరోజు మధ్యాహ్నం స్థానిక ఎన్జీవో కాలనీలోని ఎస్వీ కన్వెన్షన్ హాలులో ‘‘సన్నాహక సమావేశం’’ జరిగింది. బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, గరికపాటి మోహన్ రావు, మాజీమంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి క్రిష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే…

• కాంగ్రెస్ పార్టీ గతంలో రాహుల్ గాంధీతో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభకు లక్షల మంది జనాన్నీ సమీకరించిందట. రాష్రంలో ఉనికే లేని కాంగ్రెస్ పార్టీయే అంత జనాన్ని తీసుకొస్తే… బీఆర్ఎస్ కు అసలు సిసలైన బీజేపీ నిర్వహించబోయే అందునా ప్రధాని నరేంద్రమోదీ హాజరుకాబోయే బహిరంగ సభకు ఇంకెన్ని లక్షల మంది జనాన్ని సమీకరించాలో ఆలోచించండి. 15 లక్షలకు తక్కువ కాకుండా జన సమీకరణ చేసి ఓరుగల్లును పోరగల్లుగా మార్చి చరిత్ర స్రుష్టిద్దాం.

• కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిది. కేసీఆర్ ద్రుష్టిలో ఆ పార్టీ అంటేనే షాపింగ్ మాల్ లాంటింది. ఇప్పుడు ఆ పార్టీలో మరో కాస్ట్ లీ మెటీరియల్ వచ్చి చేరింది. కేసీఆర్ దగ్గర డబ్బులకు కొదవలేదు. ఎంత డబ్బైనా పెట్టి కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు.

• బీజేపీకి త్యాగాల చరిత్ర ఉంది. కార్యకర్తలెందరో జైలు పాలయ్యారు. సామ జగన్మోహన్ రెడ్డి వంటి వారు ప్రాణాలనే త్యాగం చేసిన చరిత్ర ఓరుగల్లుకు ఉంది. ఇంతటి పవిత్రమైన గడ్డకు ప్రపంచమే ‘‘ది బాస్ ’’ అంటూ కీర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్న నేపథ్యంలో ఆయనకు కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలికి చరిత్ర స్రుష్టిద్దాం.

• అలాంటి మోదీ తెలంగాణలో బీజేపీ కార్యకర్తల పోరాటాలను భేష్ అన్నారు. నన్ను భుజం తట్టి భేష్ అన్న సంగతిని మీరంతా చూశారు. నన్ను అనడమంటే అది నా గొప్ప కాదు.. మీ అందరి పోరాటాలే కారణం.

• ఇయాళ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే. దుబ్బాక నుండి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పై పోటీ చేసి గెలిచింది బీజేపీయే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహా తోకపార్టీలన్ని కలిసి పోటీ చేసినా 48 స్థానాల్లో జెండా ఎగరేసిన పార్టీ బీజేపీయే. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. రెండు స్థానాలకే పరిమితమైంది. దుబ్బాకసహా మునుగోడు ఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే రాలేదు… మరి కాంగ్రెస్ యాడుంది? ఆ పార్టీని జాకీ పెట్టి లేపాలని చూస్తున్నరు.

• అందుకే బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్-కాంగ్రెస్ లు పార్లమెంట్ లోపల, బయట కలిసే పనిచేస్తున్నయ్. ఒంటరిగా బీజేపీని ఓడించడం చేతగాకే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తూ తమను అప్రదిష్టపాల్జేస్తున్నాయి.

• బీఆర్ఎస్ గడీల పాలనను అంతమొందించి రామరాజ్య స్థాపనే బీజేపీ ఏకైక లక్ష్యం. అందుకోసం పేదల పక్షాన పోరాడుతున్నం. ప్రజలు సైతం బీజేపీనే ఆదరిస్తున్నారు. బీజేపీకే అధికారం ఇవ్వాలని భావిస్తున్నారు. నిన్నగాక మొన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్టులోనూ బీజేపీకే మొగ్గు రావడమే ఇందుకు నిదర్శనం.

• కేసీఆర్ కు మాత్రం ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు దుష్ట రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడా అభివ్రుద్ది గురించి మాట్లాడటం లేదు. వరంగల్ అభివ్రుద్ధి కోసం స్మార్ట్ సిటీ పథకం కింద రూ.196 కోట్లు కేంద్రం కేటాయిస్తే రాష్ట్రం వాటా మాత్రం విడుదల చేయడం లేదు. కేంద్రం తెలంగాణ అభివ్రుద్దికి కట్టుబడి ఉన్నా కేసీఆర్ మాత్రం సహకరించడం లేదు. అభివ్రుద్ధి జరిగితే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందేమోననే భయంతోనే సహకరించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు.

• ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో జరిగే అభివ్రుద్ధి పనుల్లో పాల్గొనేందుకు హన్మకొండకు వస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో 15 లక్షల మంది జనంతో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించబోతున్నాం.

• కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో సభ పేరుతో నెల రోజుల నుండి అష్టకష్టాలు పడుతూ చెమటోడుస్తోంది. ఆ పార్టీ నిర్వహించేది పాదయాత్ర ముగింపు సభనా? జాయిన్సింగ్స్ సభనో అర్ధం కానట్లుగా ఉంది. ఎవరికి వారే గొడవలతో నిమగ్నమయ్యారు.

• ఓరుగల్లులో 8న జరగబోయే మోదీ సభకు మరో 5 రోజులే సమయముంది. మోదీని చూసేందుకు ప్రపంచమంతా తహతహలాడుతోంది. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని కనివినీ ఎరగని రీతిలో జనాన్ని సమీకరించి చరిత్ర స్రుష్టిద్దాం. జన సమీకరణ విషయంలో ఎవరెంత కష్టపడ్డారనే అంశంపై పార్టీ ప్రత్యేక ద్రుష్టి సారించింది. ప్రజలను సమీకరించలేని వాడు నా ద్రుష్టిలో లీడర్ కానేకాదు.. సభ సక్సెస్ కోసం కష్టపడిన నాయకులకు పార్టీ భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇవ్వబోతోంది.

On The 8th Of This Month At 9 am, Modi Will Hold The “Vijay Sankalpa Sabha”

Hyderabad: Bharatiya Janata Party will create a new history by mobilising nearly 15 lakh people to the public meeting to be addressed by Prime Minister Narendra Modi at Hanamkonda at 9 am on July 8, BJP Telangana unit president and Karimnagar MP Bandi Sanjay said on Sunday.

Addressing a preparatory meeting at S V Convention Hall at the NGOs’ Colony in Hanamkonda to discuss the arrangements for the Prime Minister’s public meeting, the BJP state president said the meeting – named as “Vijay Sankalp Sabha” – would be unprecedented, blowing the conch from Warangal for the coming assembly elections.

“When the Congress, which has virtually no existence in the state, could mobilise lakhs of people to Rahul Gandhi meeting at Arts College grounds in the past, the BJP, which is the only potential alternative to the Bharat Rashtra Samithi could easily mobilise 15 lakh people to the Prime Minister’s meeting,” he said.
Describing the Congress party as a kirana shop, Sanjay said KCR was treating it like a shopping mall, as it had acquired another costly material. “Whatever may be the cost of the material, KCR can purchase it as he has no dearth of money,” he said.

Calling upon the party workers to extend unprecedented welcome to Modi who would be coming to Warangal, the land of sacrifices, for the first time, the BJP president said the meeting should display unity and strength of the party at the national level.

“Modi has the highest regard for the BJP workers of Telangana. He patted my back and appreciated my efforts and the fighting spirit of party workers. We shall keep up his faith in us,” he said.

Stating that the BJP was the only alternative to the BRS, Sanjay recalled how the party had grown from strength to strength in every election, right from Dubbak to GHMC to MLC elections. “The Congress, which lost its deposits in every by-election has no place in Telangana. Now, attempts are being made to breath some life into the dead party,” he said.

He alleged that the BRS and the Congress had joined hands both inside and outside the Parliament to defeat the BRS, as they realised that they could not fight with the BJP independently. “But the people are with us and they will vote for us in the elections. Even the intelligence reports confirmed the same,” he said.
He accused KCR of trying to divert the attention of people by making false allegations against the Narendra Modi government. While the centre was ready to release funds to various developmental projects in the state, the KCR government was not cooperating with the Centre fearing that it would bring good name to the BJP, he said.

Sanjay assured that those who strive hard for making the Prime Minister’s meeting a grand success would get due recognition and priority in future.

Union minister G Kishan Reddy, BJP national executive committee member Eatala Rajender, Garikapati Mohan Rao, former minister M Shashidhar Reddy and G Vijayarama Rao, state general secretary G Premender Reddy and others attended the preparatory meeting.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X