బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి…
న్యాయం గెలిచింది… ప్రజాస్వామ్యం గెలిచింది.
నిరుద్యోగుల, విద్యార్థులతోపాటు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు బెయిల్ లభించడం ప్రజాస్వామ్య విజయం.
అక్రమంగా, అకారణంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని భావించిన బీఆర్ఎస్ సర్కార్ కు కోర్టు ఉత్తర్వులు చెంప పెట్టు.
అరెస్టులు, కేసులు, జైళ్లతో బండి సంజయ్ సహా బీజేపీ కార్యకర్తలను భయపెట్టలేరు…
టీఎస్పీఎస్పీ లీకేజీపై సిట్టింగ్ జడ్జి విచారణ జరిగే వరకు, మంత్రి కేటీఆర్ ను కేబినెట్ నుండి బర్తరఫ్ చేసే వరకు, పరీక్షల రద్దు నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష పరిహారం అందేవరకు బండి సంజయ్ పోరాటం కొనసాగుతుంది.
బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద కార్యకర్తలు నాయకులు పటాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటున్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారికి బెయిల్ రావడంతో ఉత్సాహంతో కార్యకర్తలు ఆనందాన్ని పంచుకుంటున్నారు.
हैदराबाद : तेलंगाना भारतीय जनता पार्टी के अध्यक्ष और 10वीं हिंदी पेपर लीक मामले में गिरफ्तार बंडी संजय को जमानत मिली है। हनमकोंडा कोर्ट ने लगभग आठ घंटे के सुनवाई के बाद रात 10 बजे बेल मंजूर किया। साथ ही पुलिस हिरासत की सुनवाई सोमवार के लिए स्थगित किया है। कोर्ट के इतिहास में पहली बार है कि एक जमानत की याचिका पर आठ घंटे की लंबी बहस के बाद रात 10 बजे जमानत मंजूर हुई है।
जमानत प्रक्रिया से संबंधित दस्तावेज कोर्ट में पेश किये गये है। 20 हजार के मुचलके पर जमानत दी गई। मुचलके की प्रक्रिया थोड़ी देर में पूरी होने की उम्मीद जताई गई है। शुक्रवार को बंडी संजय करीमनगर जेल से रिहा किया जा सकता है। अधिवक्ताओं ने बताया कि बंडी संजय को सशर्त जमानत दी है। बिना कोर्ट की अनुमति के देश छोड़कर न जाये और पुलिस की सुनवाई में सहयोग करने का आदेश दिया है। कोर्ट परिसर में बीजेपी के नेता और कार्यकर्ता जश्न मनाये रहे है।

आपको बता दें कि पुलिस ने 4 अप्रैल मंगलवार आधी रात के बाद को बंडी संजय को गिरफ्तार कर लिया और बोम्मला रामाराम थाने ले गई। उसके बाद पालकुर्ती में मेडिकल परीक्षण कराया गया और हनुमाकोंडा कोर्ट में पेश किया गया और मजिस्ट्रेट ने 14 दिनों के लिए रिमांड पर भेज दिया। इसके साथ ही बंडी संजय को करीमनगर जेल ले जाया गया। संजय के वकीलों ने 6 अप्रैल को हनुमाकोंडा जिला अदालत में याचिका दायर कर जमानत मांग की।
इस महीने की 4 और 5 तारीख को आयोजित मीडिया कांफ्रेंस में सीपी रंगनाथ के भाषण के वीडियो को मजिस्ट्रेट के सामने दिखाए गए। कोर्ट को बताया गया कि इस महीने की 4 तारीख को सीपी रंगनाथ ने कहा कि प्रश्नपत्र लीक नहीं हुआ है, लेकिन 5 तारीख को उन्होंने अपनी बात बदल दी है। बंडी संजय पर साजिश का आरोप लगाया है।
अधिवक्ताओं ने कहा कि संजय को पुलिस ने अकारण हिरासत में लिया और कई जगहों पर ले जाकर शारीरिक व मानसिक रूप से प्रताड़ित किया। अदालत को यह भी बताया गया कि संजय के शरीर पर चोट के निशान थे। कोर्ट ने दोनों पक्षों की दलीलें दर्ज करने के बाद संजय को जमानत दे दी।
पुलिस ने कोर्ट से दसवीं के प्रश्न पत्र लीक मामले में ए1 बंडी संजय, ए2 बूरा प्रशांत और ए3 महेश को हिरासत में देने का अनुरोध किया। पुलिस ने इस हद तक अर्जी दाखिल की, लेकिन नोटिस सिर्फ संजय के वकील को दिया गया। इस पर लंबी बहस के बाद न्यायाधीश ने सुनवाई इस महीने की 10 तारीख तक स्थगित करने की घोषणा कर दी।
10th Hindi Paper Leak Case : బండి సంజయ్కు బెయిల్
హైదరాబాద్ : టెన్త్ క్లాస్ హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో కేసులో బండి సంజయ్ కి హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. ఏప్రిల్ 6 తేదీన హనుమకొండ కోర్టులో సంజయ్ బెయిల్ పిటిషన్ పై దాదాపు 8 గంటల పాటు వాదనలు జరిగాయి.
ఏప్రిల్ 4వ తేదీన మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆయనను పోలీసులు అరెస్టు చేసి బొమ్మల రామారం ఠాణాకు తరలించారు. ఆ తర్వాత పాలకుర్తిలో వైద్య పరీక్షలు నిర్వహించి హనుమకొండ కోర్టులో హాజరు పర్చగా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో బండి సంజయ్ ని కరీంనగర్ జైలుకు తరలించారు. బండి సంజయ్ కి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు ఏప్రిల్ 6న హనుమకొండ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హిందీ ప్రశ్నపత్రం లీకేజీపై లోతైన విచారణ కోసం బండి సంజయ్ ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై వరంగల్ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ తరఫు న్యాయవాదులు కేసు విచారణకు సీబీఐకి అప్పగించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
సీపీ రంగనాథ్ ఈ నెల 4,5 తేదీల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాల్లో మాట్లాడిన వీడియోలను మేజిస్ట్రేట్ ముందు ప్లే చేసి చూపించారు. ఈ నెల 4వ తేదీన ప్రశ్నపత్రం లీక్ కాలేదని సీపీ రంగనాథ్ తెలిపారని, 5న మాటమార్చారని కోర్టుకు వివరించారు. బండి సంజయ్ పై కుట్ర కోణం ఆరోపణలు చేశారన్నారు.
సంజయ్ ని పోలీసులు అకారణంగా నిర్బంధించి పలు ప్రాంతాల్లో తిప్పారని, శారీరకంగా, మానసికంగా హింసించారని తెలిపారు. సంజయ్ శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న కోర్టు బండి సంజయ్ బెయిల్ మంజూరు చేసింది.
టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ1 బండి సంజయ్, ఏ2 బూర ప్రశాంత్, ఏ3 మహేశ్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు నోటీసు మాత్రం కేవలం బండి సంజయ్ తరపు న్యాయవాదికి మాత్రమే ఇచ్చారు. దీనిపై సుదీర్ఘవాదనల అనంతరం విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. (ఏజెన్సీలు)
