సెర్ప్ ఉద్యోగులకు కొత్త పే సేల్ వర్తింపజేస్తూ జీవో విడుదల చేసినందుకు ఎమ్మెల్సీ కవితను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన సెర్ప్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు
హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమలుకు ఉత్తర్వులు జారీ చేసినందుకు సెర్ప్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు సెర్ప్ ఉద్యోగుల డిమాండ్లను ఏనాడూ పట్టించుకోలేదన్నారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు, సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించేందుకు నిర్ణయించి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా వేతనాలు చెల్లిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో 3,978 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఏప్రిల్ 1 వ తేదీ నుండి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లించనున్నారు. సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్‌రెడ్డి, ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను కలిసారు.