All The Best: तेलंगाना में इंटरमीडिएट परीक्षा, कुल 9,47,699 छात्र हाजिर

తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్, మొత్తం 9,47,699 మంది హాజరు

हैदराबाद : तेलंगाना में बुधवार से इंटरमीडिएट की सार्वजनिक परीक्षाएं शुरू हो जाएंगी। परीक्षाएं सुबह 9 से दोपहर 12 बजे तक चलेंगी। बोर्ड सचिव नवीन मित्तल ने कहा कि इस साल भी मिनट का नियम लागू किया जा रहा है। नौ बजे के बाद किसी को भी परीक्षा केंद्र में नहीं जाने दिया जाएगा।

इंटर कमिश्नरेट में सीओई जयाप्रदा बाई, परीक्षा विभाग के अधिकारी श्रीरीनिवास, भीम सिंह, मोहन और अन्य के साथ मिलकर मीडिया से बात की। उन्होंने कहा कि कुल 9,47,699 छात्र परीक्षा में शामिल होंगे। इनमें से 4,82,677 फर्स्ट ईयर और 4,65,022 सेकंड ईयर छात्र हैं।

नवीन मित्तल ने कहा कि 1473 केंद्र स्थापित किए गए हैं और छात्रों को सभी सुविधाएं प्रदान की गई हैं। छात्रों को सलाह दी जाती है कि किसी भी तरह की समस्या होने पर वे विशेष टोल फ्री नंबरों 040-24601010 या 040-24655027 पर कॉल करें। यह नंबर सुबह 8 बजे से रात 8 बजे तक काम करते हैं।

హైదరాబాద్ : తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఈ ఏడాది కూడా నిమిషం నిబంధన అమలు చేస్తున్నామని, 9 గంటల తర్వాత ఎవర్నీ లోపలికి అనుమతించబోమని బోర్డు సెక్రెటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.

మంగళవారం ఇంటర్ కమిషనరేట్ లో సీఓఈ జయప్రదబాయి, పరీక్షల విభాగం అధికారులు శ్రీనివాస్, భీమ్ సింగ్, మోహన్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలకు మొత్తం 9,47,699 మంది హాజరుకానున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్టియర్‌‌‌‌, 4,65,022 మంది సెకండియర్‌‌‌‌ స్టూడెంట్లని చెప్పారు. 

1473 సెంటర్లు ఏర్పాటు చేశామని, స్టూడెంట్లకు అన్ని సౌలత్​లు కల్పించామని నవీన్ మిట్టల్ తెలిపారు. ఏ ఇబ్బంది వచ్చినా 040–24601010, 040–24655027 ప్రత్యేక టోల్‌‌‌‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌‌‌‌ చేయాలని స్టూడెంట్లకు సూచించారు. ఇవి ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయన్నారు.

కాలేజీలతో ప్రమేయం లేకుండా స్టూడెంట్లే బోర్డ్‌‌‌‌ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ నుంచి హాల్‌‌‌‌ టికెట్లు డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. స్టూడెంట్లు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఓఎంఆర్‌‌‌‌ షీట్ పై ఉన్న డేటాను పరిశీలించాలని, తప్పులుంటే ఇన్విజిలేటర్‌‌‌‌ దృష్టికి తేవాలని సూచించారు.

ఈ ఏడాది ఆన్సర్ షీట్ల ఆన్​లైన్​ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నవీన్ మిట్టల్ తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచామని, రెండోసారి 2 కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. ఏ కంపెనీకి టెండర్ ఇచ్చేది బుధవారం క్లారిటీ ఇస్తామన్నారు. 

ఆన్ లైన్, ఆఫ్​ లైన్ వాల్యుయేషన్​ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. టెన్త్ రిజల్ట్స్ వచ్చే లోగా ఇంటర్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ ముగిస్తామని నవీన్ మిట్టల్ చెప్పారు. మిక్స్​డ్​ ఆక్యుపెన్సీ ఉన్న కాలేజీల్లో చదివే స్టూడెంట్లు, వారి పేరెంట్ల నుంచి అంగీకార పత్రం తీసుకుంటామని అన్నారు. సెకండియర్ గుర్తింపు రాకున్నా.. ఇబ్బంది ఉండబోదని రాతపూర్వకంగా ఇవ్వాలని నవీన్ మిట్టల్  సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X