తెలంగాణలో జానపదాలు, ఎందరో కళాకారులు

[మేము ఈ కథనాన్ని సోషల్ మీడియా నుండి తీసుకున్నాము. మేము ఫోటో కోసం ఈ కథనం యొక్క రచయిత Dr తుమ్మల దేవరావ్ కు ఫోన్ చేసాము. కానీ వారు ఫోన్‌ ఎత్తలేదు. ఇది మంచి వ్యాసం. పాఠకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను]

తెలంగాణ లో అనేక జానపదాలు వెళ్ళివెత్తుతున్నాయి. ఎందరో జానపద కళాకారులు సొంత యూట్యూబ్ చానళ్లు పెట్టుకుని పాటలను విడుదల చేస్తున్నారు. అవి విశేషంగా ప్రజాదరణ పొందుతున్నాయి. నిజానికి జానపదాలు రాసినవి కావు ప్రజలనాలుకలమీద నడయాడినవి. శ్రమను మరిచి ఆనందాన్ని ఆస్వాదించడానికి ఆశువుగా అల్లుకున్న పల్లెపదాలే పాటలు. జన పదులు కై గట్టుకుని పాడుకున్నవే “జానపదాలు”. గ్రామాల్లో ఎనుకట కలుపులపుడు; నాట్లు వేసేటప్పుడు; వడ్లు; పసుపు దంచేటపుడు; పెళ్లిళ్లు; వాయనాలుఇచ్చి పుచ్చుకునేటపుడు; లగ్గాలు; దండకాలు; పారచికాలు ఆడేటపుడు; జాతరలపుడు చదువురాని పల్లెపడుచులు అల్లుకున్న సొగసైన మాటలే ఈ పాటలు. ఈ మధ్య వచ్చిన అనేక జానపదాలు ప్రజల్ని అలరించి సినిమా పాటలకన్న ఎక్కువ జనాదరణ పొందినాయి.

… అందుకు ఉదాహరణ బుల్లెట్ బండెక్కి వచ్చేత పా… సెలయేరు పారుతుంటే… బంతిపూల వాసన నీబానిన్ల… ఎందెందు పోయినవయ్య ఈ రాతిరి…. ఉరుముల రమ్మంటివే..అల్లహే అల్లా…. ఏం వాన కురిసినో తదితరవి! ఈ పాటల్లో రచయితలు జానపదుల నుండి కొంత సేకరించి మరికొంత తమ సాహిత్యాన్ని కలుపుతున్నారు. శుద్ధంగా పల్లెపదాలనే పాటలుగా తీసినవి అరుదు. ఈ మధ్యనే వచ్చిన అసలు సిసలు మట్టి గొంతుక చుంచు నాగవ్వ పాడిన పాట folk కున్న బ్యూటీ ని అద్భుతంగా చాటింది. విత్తనాలు వేసేటప్పుడు; నాగళ్లను కట్టి భూమిని దున్నేటప్పుడు; సాలుసాలుకు మధ్య విత్తులు వేసేటప్పుడు; సద్దులు ఆరగించేటప్పుడు ప్రజల జీవనంలో ఉన్న సున్నితమైన ఇస్తెటిక్ బ్యూటీని పాట అద్భుతంగా చూపింది. స్వచ్ఛమైన; నిష్కల్మషమైన పల్లెటూరి ప్రేమలు భూమి చుట్టూ; వ్యవసాయం చుట్టూ; ప్రాకృతిక సౌందర్యం చుట్టూ తిరుగుతాయి.

మృగశిర కార్తె వెళ్లిపోగానే ఉత్తర(ఉత్యర)కార్తె వస్తుంది. ఉత్తర కార్తె లో వానలు ఉరిమి ఉరిమి కురుస్తయి. పాట ప్రారంభమే “ఉరిమి ఉరిమి వాన గొట్టే ఉత్తరాన మొలకే మొలిచే-జైత్యాల ఖిల్లల మీద పొద్దెమో పొడిచే రామ” అంటూ వానతో మొదలై చేనులో అరక దున్నుతున్న అన్న రామునిలా; సాలులో విత్తనాలు చల్లుతున్న వదిన సీత లా ఆడబిడ్డకు అనిపిస్తే!! ఇంటి అడపచును ఆ జంట దుర్గాదేవిగా ఆరాధిస్తారు. పగటేల సద్దులు అరగిస్తూ ముచ్చటాడుడు… గజ్జల ముల్లు గర్రను చూసి కొడ్యావు గంతులేయడం… ఇదంతా చూస్తుంటే మానవ సంబంధాలు ఇట్ల పచ్చగా ఉండాలని ఎవలకన్న అనిపిస్తది… ఈ పాటలో చుంచు నాగవ్వ మట్టి గొంతుకలో ఉండే జీర(slag)… రేగట్లో కూసోని జొన్నరొట్టె తిన్నంత సంబరంగా ఉంటది… జువ్వి చెట్టుకింద దుప్పటేసుకుని కునుకు తీసినంత హాయిగా ఉంటది. నా చిన్ననాడు మా చెలల్లో కలుపులు కలుస్తూ కమ్మని గొంతుతో పాడుకుంటూ పారచికలు ఆడుకుంటూ జుగల్ బంది నిర్వహించిన గొల్లమల్లవ్వ; మాదిగ ఎల్లవ్వ ల స్వరం గాలిని సైతం స్తంబింబ జేసేది… ఆళ్ల ఎనుక కుప్పలెత్తుకుంటు పాటల్ని విని మాబాల్యం పతంగిలా పరవశించి పోయేది!!

ఈ పాటకు నాందేవ్ (జానపద బాణీలకు అచ్చంగా సంగీతాన్ని ఇవ్వగల music డైరెక్టర్) గారు పల్లెల్లో వాడే ఇన్స్ట్రుమెంట్స్ వాడి కమ్మని సంగీతాన్ని అందించాడు. నటీనటులు పాటలో జీవించారు. ఒక జీవబాషతో కూడినపాట విన్నాం అనే అనుభూతి కలగాలంటే ఈ పాట వినండి!! జానపదుల పని పాటలో ఉన్న మానవీయతను కూడా చూడచ్చు… ఈ పాటను జనమాద్యమం లోకి తీసుకొచ్చిన వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ… ఇప్పటికి సశేషం!

Dr తుమ్మల దేవరావ్; నిర్మల్ 8985742274 (from social media)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X