Hyderabad: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ఎస్సీ మోర్ఛ అధ్యక్షులు శ్రీ లాల్ సింగ్ ఆర్య గారు జాతీయ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ శంభూనాథ్ తుండియా గారు రాష్ట్ర ఎస్సీ మోర్చా ఇన్చార్జి శ్రీ మనోహర్ రెడ్డి గారు మరియు రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఎస్సీలకు నరేంద్ర మోడీ గారి సర్కార్ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలకు, ప్రజలకు చేరవేసే కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని కార్యకర్తలకు మార్గ నిర్దేశం చేశారు. రాబోయే రోజులలో రాష్ట్రంలో జిల్లాలో మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ ముఖ్య నాయకులంతా నిత్యం ప్రజా సేవలో ఉంటూ.. ప్రజల సమస్యల పై కార్యక్రమాలు యోజన చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రత్యేకంగా ఎస్సీ నియోజకవర్గాల పైన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్న విషయాన్ని కార్యకర్తలకు గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 19 ఎస్సీ నియోజకవర్గాల్లో అలాగే మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసే విధంగా పార్టీ యోజన చేస్తుందని తెలిపారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ నాయకులు అందరూ నిరంతరం కష్టపడి, పార్టీని బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు వేముల అశోక్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కుమ్మరి శంకర్ గారు, కాంతి కిరణ్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబేద్కర్ గారు, బొట్ల శ్రీనివాస్ గారు, గద్దల అంజిబాబు గారు, రాష్ట్ర కార్యదర్శులు పోతేపాక సాంబయ్య గారు, ఓరగంటి చంద్రశేఖర్, జలాల్ శివుడు, విజయ్ కుమార్, కొండ్రు పురుషోత్తం, సత్యనారాయణ రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు.