BRAOUలో ప్రత్యేక అంతర్జాతీయ భాషా శిక్షణ, పరిశోధన ప్రయోగశాల కేంద్రాల అవసరం: జేఏసీ

72వ రోజుకు చేరిన అంబేద్కర్ వర్శీటీ ఉద్యోగుల నిరసనలు

హైదరాబాద్: డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయ స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రు అర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి (జె.ఎన్.ఏ.ఎఫ్.ఏ.యూ) కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు డిమాండ్ చేస్తూ నిరసనను కొనసాగించారు. గత 72 రోజులుగా జేఏసీ సభ్యులు, ఉద్యోగులు ప్రభుత్వ లేఖ నెం: 1043/TE/A12/2024 కు వ్యతిరేకంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు బైఠాయించి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనల హోరు కొనసాగించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) ఛైర్పర్సన్ ప్రొ. పల్లవీ కాబడే; కన్వీనర్ ప్రొ. వడ్డాణం శ్రీనివాస్; సెక్రటరీ జనరల్ డా. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం NAAC- ‘A’ గ్రేడ్‌ను సాధించింది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ – రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ నుండి నిధుల పొందే అవకాశం ఉందన్నారు. విశ్వవిద్యాలయం ఆంగ్ల భాషా అధ్యయనంతో పాటు అంతర్జాతీయ భాషలకు కూడా కోచింగ్ అందించాలని ప్రయత్నం చేపడుతున్నది వారికీ సమంధిత కోర్సుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, భాషా ప్రయోగశాలలను ప్రత్యేకంగా నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత భవనాల నిర్మాణానికి తగిన యూనివర్సిటీ స్థలం అందుబాటులో లేదన్నారు. విద్యార్థులకు కొత్తగా కంప్యూటర్ ల్యాబ్స్ నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

కార్యక్రమంలో డా. మక్దూమ్ మొహియుద్దీన్; మాలోత్ బుద్ధ మాట్లాడారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని వివరించారు.

Also Read-

జేఏసీ నేతలు డా. రంబింద్రనాథ్ సోలమన్; డా. యకేశ్ దైద; డా. ఉదయిని; డా. కిషోర్; డా. రాఘవేంద్ర; డా. అంబేద్కర్, డా. రజిత, పాండు; షబ్బీర్, రాములు; అధ్యాపక; అధ్యాపకేతర ఉద్యోగులు; అడ్మినిస్ట్రేటివ్, టెక్నికల్ అసోసియేషన్; టైం స్కేల్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X