హైదరాబాద్ : పి. ఆర్. సి. మరియు పాత పెన్షన్ విధానం వెంటనే అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ కార్డ్‌లు, పెండింగ్‌లో ఉన్న 5 డి. ఎ. లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
ఇది కూడ చదవండి-
ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం (తుంటీయ), తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు శుక్రవారం డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాల సభ్యలు మధ్యాహ్న భోజన విరామ సమయంలో పరిపాలన భవనం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి పి. ఆర్. సి. వెంటనే అమలు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని (ఓ. పి. ఎస్.) ప్రవేశ పెట్టాలని, ఉద్యోగులు వారి కుటుంభ సభ్యులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డ్‌లు జారీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డి. ఎ. లు వెంటనే విడుదల చేయాలంటూ ఉద్యోగులు నినాదాలు చేశారు.
ఈ సమావేశంలో విశ్వవిద్యాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కాంతం ప్రేమ్ కుమార్, సభ్యులు విశ్వనాథ్, మియాజాని, పాండు, అశోక్, భరత్ రెడ్డి, డా. యకేష్ దైడా, సుహాసిని, భూ లక్ష్మి, నాగ లతా, తిరుపతమ్మ, జ్యోతీ శ్రీ, అన్ని ఉద్యోగుల సంఘాల నాయకులు ఉద్యోగులు నిరసనలో పాల్గొన్నారు.
