సుప్రీం కోర్టు కీలక నిర్ణయం, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ

Hyderabad: కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు తెలంగాణకు బదిలీ అయింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ సీబీఐ స్పెషల్‌ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది. జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అలాగే సాక్ష్యాధారాలను మాయం చేసే కుట్రపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

తన తండ్రి హత్య కేసులో సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీలో కేసు విచారణ జరిగితే న్యాయం జరగదని అందుకే మరో రాష్ట్రానికి బదిలీ చేసి పర్యవేక్షించాలని ఆమె కోరారు. సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ధర్మాసంన విచారణ జరిపింది. సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత జరిగిన విచారణలో మరో రాష్ట్రానికి బదిలీ చేసేందుకు ఓకే చెప్పింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అప్పట్లో సంచలనంరేపింది. 2019 మార్చి 14న పులివెందులలోని తన ఇంట్లోనే వివేకా దారుణ హత్యకు గురయ్యారు.

ఏపీ హైకోర్టులో కేసు విచారణపై పిటిషన్లు దాఖలు కాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానితుల్ని, సాక్షుల్ని వరుసగా ప్రశ్నించింది. ఈ కేసులో ఏ2గా సునీల్ యాదవ్, ఏ3గా ఉమాశంకర్‌రెడ్డిలు ఉన్నారు. మరికొందర్ని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారారు. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు బెయిల్ పిటిషన్ల దాఖలు చేసినా హైకోర్టు, సుప్రీం కోర్టులు తిరస్కరించిన సంగతి తెలిసిందే. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

Close Welcome Bar