హైదరాబాద్: మహాబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని యాదవ విద్యా వంతుల వేదిక కార్యాలయంలో జిల్లా స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ కు యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైకని బాలు యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి వై రవికుమార్ యాదవ్ లు ముఖ్యఅతీతులు హాజరై ప్రసంగించారు. ముఖ్యంగా అన్ని జిల్లా మరియు మండల కేంద్రల్లో రెండో బీసీ కమిషన్ చైర్మన్ బిందేశ్వర్ ప్రసాద్ (BP) విగ్రహాలు ఏర్పాటు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు.
అలాగే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో యాదవుల కు 5 MP స్థానాలు, స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన లో ఉపకులాల వారిగా నమోదు చెయాలి. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 18% నిధులను బడ్జెట్లో కేటాయించాలి. యాదవ ఉపకులాలకు SNT రిజర్వేషన్లు పునరుద్ధరించాలి. రెండవ విడత గొర్రెల పంపిణీ కింద నగదు బదిలీ చెయాలి. OBC, SC, STలకు నష్టం చేస్తున్న EWS రిజర్వేషన్ ను రద్దు చేయాలి అని సెమినార్ లో వక్తలు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో శాంతన్న యాదవ్, జుర్రు నారాయణ యాదవ్, భరత్ కుమార్ యాదవ్, బత్తుల మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, మెండే రాజు యాదవ్, రవికుమార్ యాదవ్, బుచ్చన్న యాదవ్, భీమన్న యాదవ్, కృష్ణ యాదవ్, రేకులంపాటి రామాంజనేయులు యాదవ్, రాములు యాదవ్, వెంకటేష్ యాదవ్, మహేష్ యాదవ్ మరియు ఇతరులు పాల్గొన్నారు.