విజయవాడ: ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక తాము అందించే 42వ జాతీయ స్థాయి అవార్డు- 2022 కొరకు వచన కవితలకు ఆహ్వానం పలుకుతోంది.
- కవితా వస్తువు. పరిధి విషయాల్లో కవికి పూర్తి స్వేచ్ఛ.
- కవిత సామాజిక వర్తమాన స్థితిగతులను ప్రతిబింబించేలా ఉండాలి.
- రెండు కవితలు మించి పంపరాదు పంపినచో వారి కవితలు పరిశీలించ బడవు.
- కవిత ఎక్స్ రే అవార్డుకోసం ప్రత్యేకించి రాసినదై ఉండాలి.
- కవిత 2 పేజీలకు మించి ఉండరాదు. సుదీర్ఘ కవితలు పరిగణనలోకి తీసుకోబడవు.
- పేరు, చిరునామాలను ‘కవిత’ పైన కాకుండా హామీ పత్రంలో మాత్రమే రాయాలి.
- ప్రవేశ రుసుము రూ.100/-ఎం.ఓ. ద్వారా పంపాలి. డిడి లేదా చెక్ ద్వారా పంపదలిస్తే రూ.125/-లు పంపాలి.
- అత్యుత్తమ కవితకు, అవార్డుగా రూ. 10,000/-ల నగదుతో పురస్కారం.
- మరో పది కవితలకు ఉత్తమ కవితా పురస్కారాలు.
- అవార్డు గ్రహీతలు బహుకరణ సభకు స్వయంగా వచ్చి అవార్డును స్వీకరించాలని.
గడువు తేది: 31 డిశంబర్ 2022 అని, తుది నిర్ణయం ఎక్స్ రే దే నని,
కవితలు, ప్రవేశ రుసుము పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఎక్స్ రే సాహిత్య మాసపత్రిక
పోస్ట్ బాక్స్ నెం. 340, కొల్లూరి టవర్స్, దాసువారి వీధి, అరండల్ పేట, విజయవాడ-520002, ఆంధ్రప్రదేశ్
అవసరమైనవారు ఫోన్ నెంబర్: 0866-24342236, 9848448763, 9491298990 లలో సంప్రదించవచ్చని
ఎడిటర్ కొల్లూరి తెలిపారు.