हैदराबाद : शहर के जवाहरलाल नेहरू चिड़ियाघर में एक सफेद बाघ की बीमारी के कारण मौत हो गई। मई 2016 में बद्री और समीरा नामक सफेद से एक नर बाघ का जन्म हुआ था। अधिकारियों ने उसका नाम अभिमन्यु रखा गया। चिड़ियाघर के अधिकारियों ने बताया कि अभिमन्युआठ साल से किडनी से संबंधित बीमारी से पीड़ित था।
अधिकारियों ने यह भी बताया कि चिड़ियाघर के डॉक्टरों की एक टीम द्वारा इलाज किया जा रहा था। स्वास्थ बिगड़ जाने के कारण अभिमन्यु की मौत हो गई। बाद में पशु चिकित्सकों की एक टीम ने अभिमन्यु के शव का पोस्टमॉर्टम किया। शुरुआत में यह पुष्टि की गई कि उसकी मौत किडनी फेल होने के कारण हुई है। हालाँकि, अधिकारियों को संदेह है कि चिड़ियाघर पार्क में गुर्दे की बीमारियों से पीड़ित जानवरों के लिए मीर आलम तालाब का दूषित पानी जिम्मेदार है।
यह भी पढ़ें-
జవహర్లాల్ నెహ్రూ జూపార్కులో వైట్ టైగర్ అభిమన్యు మృతి
హైదరాబాద్ : నగరంలోని జవహర్లాల్ నెహ్రూ జూపార్క్‌లో అనారోగ్యం కారణంగా వైట్ టైగర్ మృతి చెందింది. 2016 మే నెలలో బద్రి, సమీర అనే వైట్ టైగర్లకు పుట్టిన మగ టైగర్‌కు అభిమన్యు అని నామకరణం చేశారు. ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయస్సు గల అభిమన్యు ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు జూ అధికారులు తెలిపారు.
జూ వైద్యుల బృందం చికిత్సల అందిస్తుండంగా పరిస్థితి విషమించడంతో అభిమన్యు మృతి చెందినట్లుగా అధికారులు ప్రకటించారు. అనంతరం అభిమన్యు మృత దేహానికి వెటర్నరీ వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. కిడ్నీ ఫెయిల్ కావడంతోనే మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, జూ పార్కులో జంతువులకు కిడ్నీ వ్యాధుల బారిన పడడానికి మీర్ ఆలం చెరువులోని కలుషిత నీరే కారణమని అధికారులు అనుమానిస్తున్నట్లు తెలిసింది. (ఏజెన్సీలు)