హైదరాబాద్ : పార్టీ ఆవిర్భావం అనంతరం.. రెండో రోజు కూడా, ఢిల్లీ లో బి ఆర్ ఎస్ అధినేత సీఎం కేసిఆర్ కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. సందర్శకులు ప్రజా ప్రతినిధులతో గురువారం రోజంతా సీఎం బిజీ బిజీ గా గడిపారు. బి ఆర్ ఎస్ జాతీయ కార్యాలయ ప్రారంభం కోసం తెలంగాణ నుంచి వేలాది గా తరలివచ్చిన పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు, ఉత్తరాది నుంచి వచ్చిన వందలాది రైతు సంఘాల నేతలు ప్రముఖులతో సీఎం కేసిఆర్ అధికారిక నివాసం తుగ్లక్ రోడ్ పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిసి పోయాయి.
తనను కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి అభిమాని, కార్యకర్త ను పేరు పేరునా పలకరించి వారితో కలిసి సీఎం కేసిఆర్ ఫోటో దిగారు. టి ఆర్ ఎస్ పార్టీ బి అర్ ఎస్ గా జాతీయ పార్టీ గా అవతరించిన చారిత్రక నేపథ్యంలో, తమ అభిమాన నేత ను కలిసి శుభాకాంక్షలు తెలిపి ఫోటో దిగి, తమ ఢిల్లీ జ్ఞాపకాలను పదిలంగా దాచుకుని నూతనోత్సాహం తో అభిమానులు తిరుగు ప్రయాణమయ్యారు.
దేశవ్యాప్తంగా ఉన్న కోలి సమాజ్ ( ముదిరాజ్ సామజిక వర్గం) బి ఆర్ ఎస్ అధినేత కు అండగా నిలవడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు గురువారం నాడు సీఎం కెసీఆర్ ను డా.శ్రీనివాస్ అల్లుడు, బొక్కా జగన్ బృందం కలిసి తమ సంఘీభావం తెలిపారు. బహుజన వర్గ బంధువుగా తెలంగాణ లో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పాలన మోడల్, జాతీయ స్థాయిలో ముందుకు రావడం తెలంగాణ ముదిరాజ్ సంఘం గర్వంగా భావిస్తున్నదని అన్నారు. కోలి సామాజిక వర్గంగా దేశవ్యాప్తంగా పలు పేర్లతో కొనసాగుతున్న ముదిరాజులు బి ఆర్ ఎస్ కు అండగా నిలిచి సీఎం కేసిఆర్ కు మద్దతు నిస్తమని వారు స్పష్టం చేశారు.
మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్
ఢిల్లీలోని సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం.. గౌరవ బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, మర్యాదపూర్వకంగా సన్మానించిన – గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు.