కరీంనగర్ జిల్లాలో పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో మంత్రి గంగుల కమలాకర్
నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మేటిగా తీర్చిదిద్దేలా కృషి
డ్రగ్స్ పై అప్రమత్తత, మనఊరు, మనబడి, స్పోర్ట్స్ మీట్ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి గంగుల
హైదరాబాద్ : రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లాలో పలు అభివ్రుద్ది కార్యక్రమాల్లో నేడు పాల్గొన్నారు. నిరంతరం ప్రజల మద్యే ఉంటూ వారి బాగోగుల్ని చూసుకోవడంలో మంత్రి గంగుల తనదైన శైలిలో దూసుకుపోతారు, ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని ప్రత్యక్షంగా పరిష్కరిస్తారనే భావన జిల్లా ప్రజల్లో భలంగా నాటుకుపోయింది.
కరీంనగర్ జిల్లాలో మంత్రి తొలుత కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో యువతకు డ్రగ్స్, ఆన్లైన్ మోసాలు, హోం లోన్ యాప్ లు, కెరీర్ గైడెన్స్ లపై అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ప్రేరణ – 2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మన బస్తి – మన బడి కార్యక్రమంలో భాగంగా నగరంలోని 28వ డివిజన్ అశోక్ నగర్ లోని దుర్గమ్మ గడ్డలో కోటి రూపాయలతో నిర్మించనున్న పాఠశాల భవనానికి భూమి పూజ చేసారు.
ఆ తర్వాత నగరంలోని అంబెడ్కర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల సెమినార్ మరియు స్పోర్ట్స్ మీట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పథకాలు బహుకరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.