రమేష్ శవయాత్ర లో పాల్గొని పాడే మోసిన వి. హెచ్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి.
Hyderabad : గజ్వెల్ లో రమేష్ శవ యాత్రలో పాల్గొన్న వి హెచ్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి. ఈ సందర్భంగా వి హెచ్, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి మాట్లతూ…”డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రద్దు చేశారని నిన్న సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసిన రమేష్. ఒక ఎస్టి కి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వదానికి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన టిఆర్ఎస్ కౌన్సిలర్. మూడు సార్లు ఇల్లు ఇచ్చి రద్దు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రమేష్.”
“రమేష్ స్వంత ఊరు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత నియోజక వర్గం గజ్వెల్ మండలం అహ్మదీపూర్. రమేష్ ది రాజకీయ హత్య. ఆయన అర్హత ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఆయన ఆత్మహత్య కు కరణమైన వారిపై హత్య కేసు పెట్టి విచారణ చేయాలి. కేసీఆర్ వెంటనే స్పందించి రమేష్ కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. పిల్లలకు ఉచితంగా విద్య అందించాలి. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో తీవ్రమైన అక్రమాలు జరుగుతున్నాయి. అక్రమాలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొని అర్హులకు ఇల్లు ఇవ్వాలి”