हैदराबाद: वंदे भारत एक्सप्रेस को बड़ा हादसा होते-होते टल गया। खम्मम जिले में यह ट्रेन एक बैल से टकराया। हादसे में ट्रेन का आगे का हिस्सा आंशिक रूप से क्षतिग्रस्त हो गया। सतर्क हुए रेलवे कर्मचारियों ने तुरंत ट्रेन को मौके पर ही रोक दिया और उसकी मरम्मत की।
शनिवार को दोपहर सिकंदराबाद से विशाखापट्टणम जा रही वंदे भारत ट्रेन खम्मम जिले के चिंतकानी मंडल के नागुलवंचा रेलवे स्टेशन ट्रैक पर आते समय एक बैल से टकरा गई। तय समय के मुताबिक यह ट्रेन रात 11.30 बजे विशाखापट्टणम पहुंचनी है। हादसे के कारण अब यह ट्रेन करीब डेढ़ घंटे की देरी से पहुंचने की संभावना है।
आपको बता दें कि वंदे भारत एक्सप्रेस इससे पहले भी कई बार पशुओं से टकराकर दुर्घटना का शिकार हो चुकी है। पिछले साल अक्टूबर में गुजरात में अहमदाबाद के पास वंदे भारत ट्रेन भैंसों से टकराकर दुर्घटनाग्रस्त हो गई थी। इस घटना में इंजन का आगे का हिस्सा क्षतिग्रस्त हो गया था। ट्रेन की चपेट में आए चार भैंसों की मौत हो गई थी। अगले दिन आनंद स्टेशन के पास इस ट्रेन ने एक गाय को टक्कर मार दी। हादसे में ट्रेन के इंजन का आगे का हिस्सा आंशिक रूप से क्षतिग्रस्त हो गया था।
इसके चलते वंदे भारत ट्रेन के पशुओं से टकराने और दुर्घटनाग्रस्त होने की घटनाओं की आलोचना भी की गई है। तेलंगाना के मुख्यमंत्री केसीआर ने तो विधानसभा में ही इस ट्रेन की आलोचना की थी। केसीआर ने टिप्पणी की, “अगर एक भैंस टक्कर मारता है तो यह टूट जाने वाला ट्रेन है।” केसीआर की भी बात एक बार फिर सही साबित की है।
ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజం, ఎద్దును గుద్దిన వందే భారత్ రైలు, ముందు భాగం ధ్వంసం
హైదరాబాద్ : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లాలో ఈ రైలు ఓ ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును ఘటనాస్థలంలోనే నిలిపివేసి మరమ్మతు చేపట్టారు.
శనివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయల్దేరిన వందే భారత్ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే ట్రాక్ పైకి వచ్చిన ఎద్దును ఢీకొంది. షెడ్యూల్ ప్రకారం ఈ రైలు రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుకోవాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా సుమారు గంటన్నర ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పశువులను ఢీకొట్టి గతంలోనూ పలుమార్లు ప్రమాదానికి గురైంది. కిందటి ఏడాది అక్టోబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో వందే భారత్ రైలు గేదెలను ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇంజిన్ ముందు భాగం ధ్వంసమైంది. రైలుకు అడ్డంగా వచ్చిన నాలుగు గేదెలు మృత్యువాతపడ్డాయి. ఆ మరుసటి రోజే ఆనంద్ స్టేషన్ సమీపంలో ఆవును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్ ముందు భాగం పాక్షికంగా ధ్వంసమైంది.
వందే భారత్ రైలు పశువులను ఢీకొట్టి ప్రమాదానికి గురైన ఘటనలపై విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై అసెంబ్లీ వేదికగానే విమర్శలు చేశారు. ‘బర్రె గుద్దితే పగిలిపోయే రైలు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. (ఏజెన్సీలు)