దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పు పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైంది. 12 ఏళ్లుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందని భావిస్తున్నాం. బాధిత కుటుంబాలకు మేము అండగా ఉంటాం. ఎన్‌ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించడం పట్ల బీజేపీ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నాం.

ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జీరో టోలెరెన్స్ విధానంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. గత11 ఏళ్ల బీజేపీ పాలనలో ఇలాంటి ఘటనలకు తావు లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చింది. ఉగ్రవాదాన్ని సంపూర్ణంగా నిర్మూలించే దిశగా మోదీ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది.

Also Read-

ప్రజాస్వామ్యంలో బుజ్జగింపు రాజకీయాలు ఏ మాత్రం ప్రోత్సహించకూడదు. దీన్ని అన్ని రాజకీయపార్టీలు దీన్ని గుర్తుంచుకోవాలి.
జాతీయ దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ చేసి, నిందితులను శిక్షించడంలో కీలకపాత్ర వహించింది.ఈ పేలుళ్ళ సంఘటన దర్యాప్తు చేసిన పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలియచేస్తున్నాను. దేశ భద్రత కోసం అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరింత కఠిన చర్యలు ప్రభుత్వాలు ఆవలంభించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X