“సీఎం గారు… మీకు మానవత్వం లేదా? జుట్టుపట్టుకుని విద్యార్థులను గొడ్డులాగా బాదుతారా?”

అప్పులు తెచ్చి, భూములమ్మితే తప్ప పాలించే పరిస్థితి లేదా?

ఆ మాత్రానికి మీరెందుకు?

కేఏ పాల్ కు అప్పగించినా అదే పనిచేస్తారు కదా?

ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది?

వాళ్ల నోళ్లెందుకు మూతపడ్డాయి?

హెచ్ సీయూ ఘటనపై తక్షణమే విచారణ జరపాలి

బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

సన్నబియ్యం కార్యక్రమంలో ప్రధాని ఫోటో ఏది?

రేషన్ బియ్యం ఖర్చులో రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు చేసేది కేంద్రమే

రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2 వేల కోట్లు మాత్రమే

కిలోకు రూ.40లు చెల్లిస్తోంది మేమే

మీరు భరించేది కిలోకు రూ.10 మాత్రమే

ఈ విషయంలో మోదీ ప్రభుత్వం గొప్పదా? రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా?

అయినా కేంద్ర సహకారంపై ఎందుకు నోరు విప్పరు?

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కటైనయ్

మజ్లిస్ ను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు

ఈ మూడు పార్టీల కుట్రలను తెలంగాణ సమాజం గమనించాలి

100 శాతం బీజేపీ పోటీ చేయాలన్నదే ఆలోచన…..త్వరలోనే పార్టీ నిర్ణయం ప్రకటిస్తుంది

గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల్లో అభ్యంతరాలున్నాయి

వెంటనే న్యాయ విచారణ జరపండి

మెరిట్ విద్యార్థులందరికీ న్యాయం చేయాలన్నదే బీజేపీ డిమాండ్

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్…..

హైదరాబాద్: సెంట్రల్ వర్శిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. ‘‘‘‘ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే… వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్దతి? భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అంత మాత్రాన మీరెందుకు…కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా?‘‘అంటూ మండిపడ్డారు.

బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆయనేమన్నారంటే…
అందరికీ ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలు. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీ చూసి బాధపడని వాళ్లు లేరు. ప్రతి ఒక్కరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఏదో గొప్ప పనిచేశామని అనుకుంటున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేనట్లుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే… వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్దతి? భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? ఈనెల జీతాలివ్వాలంటే భూములు అమ్మాల్సిందేనా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన?

Also Read-

ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రూముల్లో దూరి కొడతారా? రాత్రివేళ ఇష్టమొచ్చినట్లు కొట్టి అరాచక పాలన చేస్తారా? లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. మొత్తం ఘటనపై విచారణ జరపాలి. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది? వాళ్లంతా విద్య గురించి మాట్లాడేవాళ్లు కదా? కమ్యూనిస్టు భావజాలంతో కొట్లాడతామని చెప్పుకుంటారు కదా? మరి వాళ్ల నోళ్లెందుకు మూతపడ్డాయి? వేల కోట్లకు భూములమ్మితే మీకు కూడా కమీషన్లు వస్తున్నాయని మౌనంగా ఉన్నారా? స్పష్టం చేయాలి.

అసలు వర్శిటీ భూములు అమ్మాల్సిన కర్మ ఏంది? అమ్మడానికి మీరెవరు? అభివ్రుద్ధి పేరుతో భూములను అమ్మి పాలించడానికి మీరెందుకు? కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా? మరి అప్పులు తెచ్చి, భూములు అమ్మి, ప్రజల ఆస్తులను అమ్ముతామని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు? చెబితే ఒక్క ఓటు కూడా పడకపోయేది కదా? అందుకే హెచ్ సీయూ భూముల అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ విషయంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది.

రేషన్ బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలి. సన్నబియ్యం విషయంలో మొత్తం ఖర్చు ఎంత? అందులో కేంద్ర, రాష్ట్ర వాటా ఎంతో స్పష్టం చేయాలి. ఈ బియ్యం విషయంలో ఏటా నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోంది. కిలోకు రూ.40 చొప్పున ఖర్చు చేస్తోంది కేంద్ర ప్రభుత్వమే. వడ్ల కొనుగోలు మొదలు, రవాణా, మిల్లింగ్, సుతిలీ తాడు ఛార్జీలన్నీ భరించేది కేంద్రమే. ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కోసం అప్పు తీసుకొస్తే…వడ్డీతోసహా పైసలన్నీ చెల్లించేది కేంద్రమే. సన్న బియ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.10లు మాత్రమే భరిస్తోంది. మహా అంటే రూ.2 వేల కోట్లకుపైగా భారం పడుతోంది. ఈ లెక్కన రూ.10 వేల కోట్లకు పైగా చెల్లిస్తున్న మోదీ ప్రభుత్వం గొప్పదా? 2 వేల కోట్లకుపైగా భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా? ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. కేంద్రం ఇంత చేస్తున్నా నిన్న జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ఒక్క సారైనా చెప్పారా? ప్రధానమంత్రికి కనీసం థ్యాంక్స్ చెప్పరా? అసలు ప్రధాని ఫోటో పెట్టకపోవడం ఎంత వరకు కరెక్ట్? సీఎం ఫోటో పెట్టడంలో తప్పు లేదు… కానీ ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదన్నదే మా ప్రశ్న.

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ ఒక్కటి కాబోతున్నయ్. మజ్లిస్ అభ్యర్ధిని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నయ్. ఇప్పటికే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఈ రెండు పార్టీలు కలిసే హాజరైనయ్. త్వరలో హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నయ్. ఎవరిని పిలవాలో కలిసే డిసైడ్ చేస్తున్నాయి. అట్లాగే జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే ఎంఐఎం అభ్యర్ధికి మద్దతిస్తున్నాయి.

నిజానికి బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో అత్యధికంగా 70కిపైగా ఓట్లున్నాయి. అయినా పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ కూడా అంతే. మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్దమైనయ్. ఈ మూడు పార్టీలు ఒక్కటే అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదు. తెలంగాణ సమాజ ఆలోచించాలి. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ ను, తెలంగాణను మజ్లిస్ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోంది. ఈ విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటాం.

గ్రూప్ 1 పరీక్షలంతా గందరగోళంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ మాయంలో గ్రూప్ 1 పరీక్ష లీక్ అయ్యింది. కాంగ్రెస్ పాలనలో గ్రూప్ 1పై అభ్యర్థులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X