हैदराबाद : तेलंगाना राज्य लोक सेवा आयोग पेपर लीक मामले में एसआईटी ने अपनी जांच प्रक्रिया तेज कर दी है। तेलंगाना भाजपा अध्यक्ष बंडी संजय को एक बार फिर एसआईटी पुलिस ने नोटिस दिया है। नोटिस में कहा गया है कि रविवार को एसआईटी के सामने पेश होना है। एक बार फिर पेपर लीक होने पर साक्ष्य उपलब्ध कराने के लिए नोटिस जारी किया गया है। हाल ही में दिए गये नोटिस पर बंडी संजय एसआईटी के सामने पेश नहीं हुए। बंडी संजय ने एसआईटी को पत्र लिखकर कहा कि वह संसद की बैठकों के कारण दिल्ली में हैं। इसके चलते एसआईटी के सामने हाजिर नहीं हो सकते।
शुक्रवार को एसआईटी के सामने बंडी संजय को पेश होना था, लेकिन अनुपस्थित थे। इसके साथ ही एक बार फिर एसआईटी ने संजय को नोटिस दिया। क्या बंडी संजय नोटिस का जवाब देंगे? एसआईटी सामने हाजिर होंगे या नहीं? यह चर्चा का विषय बना है। शुक्रवार को एसआईटी को लिखे पत्र में बंडी संजय ने कहा कि उसे एसआईटी पर भरोसा नहीं है और वह सबूत नहीं देना चाहते हैं। उन्होंने कहा कि उन्हें एसआईटी का नोटिस नहीं मिला है और उन्हें एसआईटी पर भरोसा नहीं है। पेपर लीक मामले की जांच सिटिंग जज से कराना चाहते हैं।
संबंधित खबर :
TSPSC Paper Leak Scam : బండి సంజయ్‌కు మరోసారి సిట్ నోటీసులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మరోసారి సిట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పేపర్ లీకేజీపై ఆధారాలు ఇవ్వాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇటీవల నోటీసులు ఇవ్వగా.. బండి సంజయ్ సిట్ ముందు హాజరుకాలేదు. పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా తాను ఢిల్లీలో ఉన్నానని, పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాల్సి ఉన్నందున హాజరుకాలేనంటూ సిట్‌కు బండి సంజయ్ లేఖ రాశారు.
శుక్రవారం సిట్ ముందు బండి హాజరుకావాల్సి ఉండగా దూరంగా ఉన్నారు. దీంతో మరోసారి బండికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులకు బండి ఎలా స్పందిస్తారు? సిట్ ముందు హాజరవుతారా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. సిట్‌పై తనకు నమ్మకం లేదని, ఆధారాలు ఇవ్వదల్చుకోలేదంటూ శుక్రవారం సిట్‌కు రాసిన లేఖలో బండి పేర్కొన్నారు. తనకు సిట్ నోటీసులు అందలేదని, సిట్‌ను తాను విశ్వసించడం లేదని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నట్లు చెప్పారు.
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై నేడు తెలంగాణ బీజేపీ నిరుద్యోగ మహాధర్నా కార్యక్రమం చేపట్టనుంది. ఇందిరాపార్క్ వద్ద జరగనున్న ఈ నిరసన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ధర్నాకు హైకోర్టు కూడా అనుమతి జారీ చేసింది. ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో ఈ ధర్నా చేపట్టనున్నారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ముఖ్య నేతలు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం జరగనున్న క్రమంలో బండి సంజయ్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేయడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పేపర్ లీక్‌పై బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని సిట్ నోటీసులు ఇచ్చింది. కానీ సిట్‌కు ఆధారాలు ఇచ్చేందుకు బండి సంజయ్ విముఖత వ్యక్తం చేస్తోన్నారు. దీంతో రెండోసారి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంతో.. ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది.
ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. దీంతో రేవంత్ సిట్ ముందు హాజరై తన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించారు. సిట్ మాత్రం రేవంత్ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని చెబుతోంది. దీంతో సిట్ కార్యాయలం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సిట్ ఆఫీస్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్‌లు చేయడంతో టెన్షన్ చోటుచేసుకుంది. (ఏజెన్సీలు)