TSPSC : AE पेपर लीक मामला SIT के हवाले

हैदराबाद : AE पेपर लीक मामले में एक अहम घटनाक्रम सामने आया है। हैदराबाद सीपी सीवी आनंद ने टीएसपीएससी पेपर लीक मामले को SIT के हवाले करने का आदेश जारी किया। आदेश में कहा गया है कि अतिरिक्त सीपीएआर श्रीनिवास के निर्देशन में मामसे की जांच की जाएगी।

दूसरी ओर नामपल्ली कोर्ट ने इस मामले में गिरफ्तार 9 आरोपियों को 14 दिन की रिमांड पर भेज दिया है। पुलिस ने 8 आरोपियों को चार्लापल्ली जेल और एक अन्य आरोपी रेणुका को चंचलगुडा महिला जेल भेज दिया है।

पेपर लीक मामले को लेकर आज पूरे तेलंगाना में छात्र संगठनों और राजनीतिक दलों ने आंदोलन किया गया। हैदराबाद में टीएसपीएससी कार्यालय के सामने जमकर आंदोलन किया।

TSPSC పేపర్ లీక్ కేసు సిట్కు

హైదరాబాద్ : AE పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోవైపు ఈ కేసులో 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు 8 మంది నిందితులను చర్లపల్లి జైలుకు, మరో నిందితురాలు రేణుకను చంచల్ గూడ మహిళా జైలుకు తరలించారు.

పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో దర్యాప్తు సిట్ చేతికి వెళ్లడంతో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. నిందితుడు ప్రవీణ్  సెల్ ఫోన్లో చాలా మంది మహిళల ఫోన్ నంబర్లు ఉన్నాయని టీఎస్పీ ఎస్సీ కి వచ్చే మహిళలతో సంబంధాలన్నాయని గుర్తించారు. ప్రధాన సర్వర్ నుంచి ప్రవీణ్ పేపర్ ను కొట్టేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

మరోవైపు ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేపర్  ఎక్కడ లీకేజ్ అయిందో పోలీసులు గుర్తించారు. మహబూబ్ నగర్ జిల్లా  గండేడ్ తండాకు 50 కి.మీ దూరంలో ఇద్దరు పేపర్ మార్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. గండేడ్ లో పేపర్లు తీసుకున్న ఆ ఇద్దరు ఎవరనేదానిపై విచారణ కొనసాగుతోంది. పేపర్ లీక్ పై  పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన ఆ ఇద్దరు అభ్యర్థులెవరనేది కూడా  ప్రశ్నార్థకంగా మారింది. అయితే దీనిపై  పోలీసులు ఎందుకు పరిధి దాటి విచారించడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. (ఏజెన్సీలు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X