हैदराबाद : करीमनगर जिले में होली के दिन अप्रिय हादसा हुआ। सदाशिवपल्ली में के पास तीगता पुल के पास मानेरू नदी में तैरने के दौरान तीन छात्रों की मौत हो गई। पुलिस ने मौके पर पहुंचकर सर्च ऑपरेशन शुरू किया। शव बरामद किए गए। मृतकों की पहचान हाउसिंग बोर्ड कॉलोनी निवासी वीरांजनेयुलू (12), अनिल (13) और संतोष (14) के रूप में की गई है। शवों को पोस्टमार्टम के लिए करीमनगर सरकारी अस्पताल में भेज दिया गया।
सीएम केसीआर और मंत्री गंगुला ने तीन छात्रों की मौत पर दुख जताया है। सरकार की ओर से हर छात्र के परिवार को तीन लाख रुपये और मंत्री गंगुला कमलाकर की ओर से दो लाख रुपये के मुआवजे की घोषणा की गई है।
హోలీ రోజున విషాదం, ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాలో హోలీ పండుగ రోజున విషాదం నెలకొంది. సదాశివపల్లి వద్ద తీగత వంతెన సమీపంలో మానేరు వాగులో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు బాలురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీశారు. మృతులు ముగ్గురు హౌసింగ్ బోర్డ్ కాలనీ వాసులు వీరాంజనేయులు (12), అనిల్ (13), సంతోష్(14) గా గుర్తించారు. మృతదేహాలను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే తమ పిల్లల చావుకు రివర్ ఫ్రంట్ కాంట్రాక్టరే కారణమంటూ మృతుల బంధువులు ఆరోపించారు. సంఘటన స్థలానికి వచ్చిన ఏసీపీ కరుణాకర్ వాహనాన్ని అడ్డుకుని దాదాపు రెండు గంటలు ఆందోళన చేపట్టారు. తమ పిల్లల చావుకు కారణమైన కాంట్రాక్టరుపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామని పోలీసులు చెప్పడంతో ఆందోళన విరమించారు.
ముగ్గురు చిన్నారుల మృతిపట్ల సీఎం కేసీఆర్, మంత్రి గంగుల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం తరపున రూ. 3 లక్షలు, మంత్రి గంగుల తరపున రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. (ఏజెన్సీలు)