हैदराबाद : विकाराबाद जिले के पुडुरु मंडल के मंचनपल्ली सरकारी प्राथमिक विद्यालय में दर्दनाक हादसा हो गया। चौथी कक्षा की छात्रा दीक्षिता की करंट लगने से मौत हो गई। स्कूल के बाथरूम में लटक रहा बिजली का तार छात्रा के पैर में लग गया और वह गिर पड़ी। इसके चलते वह हाथ से तार को निकालने की कोशिश की।
इसी दौरान छात्रा को करंट लग गया और वह गिर पड़ी। गिर जाने से उसके हाथ-पैर में गंभीर चोटें आईं। स्कूल के प्रिंसिपल और स्थानीय लोगों ने उसे पारिगी के एक निजी अस्पताल में पहुंचाया।
डॉक्टरों ने पुष्टि की कि पहले ही उसकी मौत हो चुकी है। बताया जा रहा है कि इस छात्र के साथ चार अन्य छात्र भी थे। जब दीक्षिता को बिजली का झटका लगा, तो छात्रों ने तुरंत स्कूल के शिक्षकों को सूचित किया। अगर उन्होंने दीक्षिता को उठाने की कोशिश की होती, तो बड़ा हादसा होता।
छात्रा के परिजनों ने आरोप लगाया स्कूल के शिक्षक और स्कूल की मरम्मत करने वाले ठेकेदार की लापरवाही ही दीक्षिता की मौत हुई है। पता चला है कि मन उरु – मन बडी कार्यक्रम के तहत स्कूल का नवीनीकरण किया जा रहा है। छात्रा की मौत से गांव में मातम छा गया है।
ప్రభుత్వ పాఠశాలలో కరెంటు షాక్, విద్యార్థిని మృతి
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి ధీక్షిత అనే నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది. స్కూల్ బాత్రూం వద్ద వేలాడుతున్న విద్యుత్ వైరు విద్యార్థిని కాలికి తగిలి కిందపడడంతో చేతితో ఆ వైర్లు తొలగించే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో కరెంటు షాక్ తగిలి విద్యార్థిని చేతికి, కాళ్ళకు తీవ్ర గాయాలై కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన స్కూల్ ప్రిన్సిపాల్, స్థానికులు పరిగిలోని ఓ ప్రైవేట్ హస్పిటల్ కు తరలించారు.
అయితే అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇదే విద్యార్థినితో పాటు మరో నలుగురు విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ధీక్షితకు కరెంటు షాక్ తగలగానే ఒక్కసారిగా భయపడ్డ తోటి విద్యార్థినిలు వెంటనే పాఠశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. ఒక వేళ వీరు కూడా ధీక్షితను పైకి లేపే ప్రయత్నం చేసి ఉన్నట్లైతే తీవ్ర విషాదమే మిగిలేది.
దీక్షిత మృతికి పాఠశాల ఉపాధ్యాయులతోపాటు, స్కూల్ మరమ్మతులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని.. బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఈ మధ్యే స్కూల్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. (ఏజెన్సీలు)
