హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహశ్ కుమార్ గౌడ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ ఎంపీ లు పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, సీనియర్ నాయకులు కోదండరెడ్డి, సునీతా రావ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ పై బీజేపీ, కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు వైఖరికి నిరసనగా దీక్ష. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రధాన నగరాలలో దీక్షలు చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు.

భూపాలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
- సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం..
- రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది..
- 24 గంటల ఉచిత కరెంటు అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం..
- కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదు..
- తొమ్మిదిన్నరేళ్ల పాలనలో విద్యుత్ సంస్థలను రూ.60వేల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు సీఎం కేసీఆర్..
- భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యుత్ డీఈ కార్యాలయం ముందు కాంగ్రెస్ నాయకుల నిరసన ప్రదర్శన.. సీఎం దిష్టిబొమ్మ దహనం..
- పాల్గొన్న గండ్ర సత్యనారాయణ రావు గారు..
భూపాలపల్లి పట్టణం: ఈరోజు గాంధీభవన్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తుందని, రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. టీపీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ (డీఈ ఆఫీస్) ముందు భూపాలపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి, అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సత్యనారాయణ రావు గారు పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం, కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో విద్యుత్ సంస్థలను రూ.60వేల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.

రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. అంతేకాకుండా, రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి, రైతులకు ఇందిరా జల ప్రభ ద్వారా బోర్లు వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ఉన్నారు.

