టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగారి ప్రెస్ మీట్ పాయింట్స…
గత రెండు రోజులుగా పుట్టలో పడుకున్న పాములు బయటకు వచ్చి నన్ను నిందించే ప్రయత్నం చేస్తున్నాయి.
అమెరికాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ విధానాల గురించి వివరించా.
వారి సందేహాలను నివృత్తి చేసాం.
24గంటల విద్యుత్ సరఫరా విషయంపై సాంకేతికంగా వివరించే ప్రయత్నం చేసాం.
కేటీఆర్, బీఆరెస్ మా వీడియోను ఎడిట్ చేసి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారు.
బీఆరెస్ చిల్లర ప్రయత్నంతో రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పై చర్చకు అవకాశం వచ్చింది.
వైఎస్ పాదయాత్ర చేసి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి నెరవేర్చారు.
బషీర్ బాగ్ కాల్పుల ఘటన జరిగిన సందర్భంలో కేసీఆర్ హెచ్ఆర్డీ విభాగం అధ్యక్షుడుగా ఉన్నారు.
ఉచిత విద్యుత్ సాధ్యం కాదని ఆనాడు కేసీఆర్ చెప్పారు.
బషీర్ బాగ్ కాల్పుల ఘటన సందర్భంలో కేసీఆర్ కీలక స్థానంలో ఉన్నారు.
ఉచిత విద్యుత్ హామీపై తొలి సంతకం చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్.
ఉచిత విద్యుత్ మాత్రమే కాదు.. రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్.
వ్యవసాయాన్ని పండగ చేయాలని కాంగ్రెస్ అనేక పథకాలు తీసుకొచ్చింది.
రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల పంపిణీ విషయంలో జైపాల్ రెడ్డి గారు ఎంతో చొరవ చూపారు.
జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ప్రాతిపదికన విద్యుత్ పంపకాలు జరపాలని ఆయన సోనియాను ఒప్పించారు.
అలా తెలంగాణకు 53శాతం.. ఏపీకి 47 శాతం విద్యుత్ ఇచ్చేలా ఆనాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
వ్యవసాయం అంటే ఏమిటో నాకు తెలుసు… నాగలి పట్టడం, గుంటుక కొట్టడం తెలిసిన వాడిని.
కేటీఆర్ లా నేను అమెరికాలో బాత్రూంలు కడగలేదు.
వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న రైతు బిడ్డను నేను.
నేను పాస్ పోర్ట్ బ్రోకర్ కొడుకును కాదు.
వాస్తవంగా కేసీఆర్ 24 గంటలవిద్యుత్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు.
భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అప్పట్లో కేసీఆర్ గొప్పగా చెప్పారు.
2.60 పైసలకే విద్యుత్ ప్లాంట్లు ఇస్తామని … ప్లాంట్ల ఏర్పాటు విరమించుకోవాలని గతంలో కేంద్రం చెప్పింది.
కేసీఆర్ పాలనలో ఏ ప్లస్ గ్రేడ్ ఉన్న డిస్కంలు సీ మైనస్ కు పడిపోయాయి.
కాంగ్రెస్ హయాంలో మొదటి పది స్థానాల్లో ఉన్న డిస్కంలు… కేసీఆర్ హయాంలో చివరి పడిస్తానాల్లోకి పడిపోయాయి.
2వేల కోట్ల యూనిట్లు ఉచితంగా ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారు.
ఏడాదికి 16వేల కోట్లు 24 గంటల విద్యుత్ కు ఖర్చు చేస్తున్నామన్నారు.
ఉచితాన్ని అనుంచితంగా కేసీఆర్ అవినీతికి వాడుకుంటున్నారు.
24గంటల విద్యుత్ ముసుగులో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది.
24 గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ కు ఎలాంటి శశభిషలు లేవు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరతాం.
సెప్టెంబర్ 17న మా మేనిఫెస్టోలో ప్రకటిస్తాం.
ఉచిత విద్యుత్ ముసుగులో ఏడాదికి 8వేల కోట్లు దోచుకుంటున్నారు.
పవర్ ప్లాంట్ల విషయంలో కేసీఆర్ 45వేల కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారు.
దోపిడీలు చేసి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ ను రద్దు చేస్తాం.
తెలంగాణ ప్రజలకు భారంగా మారిన అవినీతి కేసీఆర్ రద్దు చేస్తాం.
కేటీఆర్ , హరీష్ ను సూటిగా అడుగుతున్నా.
24గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి ఇచ్చిన సవాల్ ను స్వీకరించండి.
అసలు నిజం బయటపడుతుందనే బీఆరెస్ నిరసనల డ్రామాలు.
కరీంనగర్ చౌరస్తాలో గుమ్మికింద పందికొక్కు నన్ను ఉరి తీస్తా అని మాట్లాడుతుండు.
నేను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారు.
మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు?
చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరా నా గురించి మాట్లాడేది.
25 లక్షల 50వేల మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించబోతుంది.
ఇది నిజం కాదని చెప్పడానికి మీలో ఎవరు వస్తారు?
ఖమ్మంతో మేం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే… నిన్న నిరసనలతో బీఆరెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది.
రాష్ట్రంలో పొలరైజేషన్ మొదలైంది.
70 శాతం బీఆరెస్ ఎమ్మెల్యేలు గెలవరని కేసీఆర్ సర్వేలో తేలింది.
కేసీఆర్ గజ్వేల్ లో గెలుస్తారన్న గ్యారంటీ లేదు.
అందుకే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది కేసీఆర్ స్పష్టంగా చెప్పడంలేదు.
మీరు నిజంగా మగాళ్లు అయితే, దమ్ముంటే సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని ప్రకటించండి.
24గంటల విద్యుత్ పై గతంలో సీబీఐ విచారణ కోరిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు.
కాళేశ్వరం అవినీతిపై ఎందుకు విచారణ కొరడంలేదు.
24 గంటల ఉచిత విద్యుత్ పై ఏ సబ్ స్టేషన్ లోనైనా చర్చకు సిద్ధం.
కేసీఆర్ పాలనలో మూడు పంటలకు నీళ్లు ఇవ్వలేదు… మూడు గింజలు కొనలేదు.
వరి వేస్తే ఉరే అని చెప్పిన నీచుడు కేసీఆర్..