हैदराबाद: टीपीसीसी अध्यक्ष रेवंत रेड्डी की पदयात्रा सोमवार से शुरू होगी। हाथ से जोड़ो अभियान के अंतर्गत रेवंत रेड्डी कल मेडारम के सम्मक्का सारलम्मा मंदिर से शुरू होगी। इसके चलते रेवंत रेड्डी अपने हैदराबाद स्थित आवास से सुबह 8 बजे पदयात्रा के लिए रवाना होंगे।
वरंगल हाईवे से होते हुए मुलुगु के लिए प्रस्थान करेंगे। बाद में मुलुगु में गट्टम्मा और साईंबाबा मंदिरों में विशेष पूजा की जाएगी। वहां से सुबह 11 बजे वे मेडारम स्थित सम्मक्का सारलाम्मा मंदिर पहुंचेंगे और विशेष पूजा-अर्चना करेंगे। इसके बाद ठीक 12 बजे रेवंत रेड्डी पदयात्रा शुरू करेंगे।
हालांकि, रेवंत रेड्डी की पदयात्रा मेडारम से कोत्तुर, नारलापुर और प्रोजेक्ट नगर तक जारी रहेगी। दोपहर 2 बजे से 2.30 बजे तक प्रोजेक्ट नगर में लंच ब्रेक रहेगा। दोपहर 2.30 बजे प्रोजेक्ट नगर से पदयात्रा फिर से शुरू होगा।
शाम 4.30 से 5 बजे पसरा गांव में चाय विश्राम होगा। शाम 5 से 6 बजे तक पसरा जंक्शन पर नुक्कड़ सभा का आयोजन किया जाएगा। शाम 6 बजे वापस पसरा से पदयात्रा जारी रहेगी। रात 8 बजे रामप्पा गांव पहुंचेगी। रेवंत रेड्डी रात के लिए रामप्पा गांव में आराम करेंगे।
హత్ సే హత్ జోడో అభియాన్: సోమవారం నుంచి రేవంత్ రెడ్డి పాదయాత్ర, షెడ్యూల్ ఇదే
హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర సోమవారం నుంచి ప్రారంభం కానుంది. హత్ సే హత్ జోడో అభియాన్‌లో భాగంగా చేయనున్న రేవంత్ పాదయాత్ర రేపు మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పాదయాత్రకు బయలు దేరనున్నారు.
వరంగల్ హైవే మీదుగా ములుగుకు బయలుదేరతారు. అనంతరం ములుగులోని గట్టమ్మ, సాయిబాబా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు మేడారంలోని సమ్మక్క సారలమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సరిగ్గా 12 గంటలకు రేవంత్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు.
అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర మేడారం నుంచి కొత్తూరు, నార్లాపుర్, ప్రాజెక్ట్ నగర్ వరకు సాగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 2 30 వరకు ప్రాజెక్ట్ నగర్‌లో భోజన విరామం ఉంటుంది. ప్రాజెక్ట్ నగర్ నుంచి మధ్యాహ్నం రెండున్నరకు మళ్లీ పాదయాత్ర మొదలుపెడతారు.
సాయంత్రం 4.30 నుంచి 5 గంటలకు పస్రా గ్రామంలో టీ విరామం తీసుకుంటారు. పస్రా జంక్షన్‌లో సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు పస్రా నుంచి పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రి 8 గంటలకు రామప్ప గ్రామానికి చేరుకుంటారు. రాత్రికి రామప్ప గ్రామంలోనే రేవంత్ రెడ్డి బస చేస్తారు. (ఏజెన్సీలు)