కేసీఆర్… 35 వేల కోట్లు దోచిన గజదొంగ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో సర్పంచ్ లకు నిధుల విడుదల, ప్రభుత్వ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ధర్నా చౌక్ కు వెళ్లబోతున్న రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం విడుదల చేశారు.

అనంతరం బొల్లారం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడారు. పల్లె సీమలే దేశాని పట్టు గొమ్మలు అన్న మహాత్మాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయితీలకు నిధులు, విధులను కేటాయించింది. రాజీవ్ గాంధీ గారు తన హయాంలో 73,74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయితీలకు నేరుగా నిధులిచ్చి ఆ నిధులపై సర్పంచులకు సర్వాధికారాలను కట్టబెట్టారు. కానీ కేసీఆర్ ఆ స్ఫూర్తి మరిచి పంచాయితీరాజ్ సంస్థలను నాశనం చేస్తున్నాడు. గ్రామ పంచాయితీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది.

నెలనెలా పంచాయితీలకు చెల్లించాల్సిన వందలాది కోట్ల నిధులను ఇవ్వకుండా మరోవైపు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయాల 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయితీలకు చేరకుండా ఈ ప్రభుత్వం కొల్లగొట్టింది. గ్రామపంచాయితీలకు వివిధ బకాయిల కింద ఇవ్వాల్సిన దాదాపు రూ. 35 వేల కోట్లను కొల్లగొట్టిన గజదొంగ కేసీఆర్. ఈ గజదొంగను జైళ్లలో పెట్టాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగమైతే ఈ అంశం మీద విచారణ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఎందుకు డిమాండ్ చేయడం లేదు.

Related News:

సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయితీలన్నీ ఆర్థికంగా నిర్వీర్యమయ్యాయి. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించే పరిస్థితికి పంచాయితీలు చేరుకున్నాయి. తండాలను పంచాయతీలు చేశానని కేసీఆర్ గొప్పలు చెబుతున్నారు. ఏ తండాలోని పంచాయితీలకైనా పక్కా భవనాలు కట్టించారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గ్రామాల్లో సశ్మానవాటిక, పల్లె ప్రకృతివనం తదితర పనుల కోసం సర్పంచులు సొంత నిధులతో చేపట్టారు. వీటి బిల్లులను సకాలంలో విడుదల చేయకపోవడంతో మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మునుగోడులో సర్పంచ్ బస్టాండ్ లో బిచ్చమెత్తాడు. సూర్యాపేట జిల్లాలో శాంతమ్మ అనే మహిళా సర్పంచి తాళి అమ్ముకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.35 వేల కోట్ల పంచాయితీ నిధులను దొంగిలించి మెగా కృష్ణారెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ వంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుంది. వారి నుంచి కమీషన్ తీసుకుంటుంది. ఇసుక, రిజిస్ట్రేషన్ నుంచి వచ్చే ఆదాయం కూడా పంచాయితీలకు దక్కడం లేదు. ఇవన్నీ ప్రభుత్వ ట్రెజరీలో జమ అవుతున్నాయి. అటునుంచి తిరిగి గ్రామపంచాయితీలకు జమ కావడం లేదు. దీంతో గ్రామపంచాయితీలకు ఆదాయ వనరులు తరిగిపోతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో సర్పంచులకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సర్పంచ్ లకు కాంగ్రెస్ అండగా ఉంటామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది?

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపకుండా కాంగ్రెస్ నాయకులను ఎక్కడిక్కడ అరెస్ట్ చేసింది. కొందరి పట్ల దురుసుగా ప్రవరిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మా నాయకురాలు విజయారెడ్డి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఇది మంచి పద్ధతి కాదు. అన్ని గుర్తుపెట్టుకుంటాం. ఎల్లకాలం కేసీఆర్ అధికారంలో ఉండడు.. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. మా ప్రభుత్వంలో చట్టానికి లోబడి అటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుంటాము.

గతంలో కేసీఆర్ శాసనసభలో ఉపవాసం ఉండైనా పంచాయితీలకు నిధులను విడుదల చేస్తాం అన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో తెలియదు. పంచాయతీ నిధులను వెంటనే విడుదల చేయాలి. ఆత్మహత్యలకు పాల్పడ్డ సర్పంచ్ ల కుటుంబాలను ఆదుకోవాలి. హైకోర్టులో అనుమతి తెచ్చుకుని ధర్నా చౌక్ లో ధర్నా చేసి తీరతాం. సర్పంచులు మంత్రులను అడ్డుకుని నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రుల కార్యక్రమాలు బహిష్కరించండి. మీకు కాంగ్రెస్ అండగా ఉంటుంది.. మీకోసం కొట్లాడుతుంది. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారారు. డీజీపీ అంజనీకుమార్ మమ్మల్ని అరెస్టు చేసి ప్రభుత్వానికి నజరానా ఇవ్వాలనుకున్నారు. ధర్నా చౌక్ లో ధర్నాకు అనుమతి అవసరం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు

తెలంగాణతో టిఆర్ఎస్కు పేరుబంధం ఉండేదని.. పార్టీ పేరు మార్పుతో పేగు బంధం తెగిపోయిందన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తోందని రేవంత్ అన్నారు. కేసీఆర్ కు కాలం చెల్లిపోయిందని.. ఇంకో ఐదారు నెలలు మాత్రమే అధికారంలో ఉంటారన్నారు. బీహార్ తో కేసీర్ కు రక్త సంబంధం ఉంది. 2008లో ఒక చానెల్లో తమ పూర్వీకులు బీహార్ నుంచి వచ్చారు అని కేసీఆర్ స్వయంగా చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. త్వరలోనే కేసీఆర్ బీహార్ కు పారిపోవడం ఖాయమన్నారు.

కేసీఆర్ అవినీతి అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు? వైషమ్యాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందలనుకుంటున్నారు. అయ్యప్ప స్వాములను దూషించిన విషయంలో కూడా రాజకీయ కుట్ర దాగుంది. వెస్ట్ బెంగాల్ తరహా వ్యుహాన్ని తెలంగాణలో అమలు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, బీఆరెస్ రాజకీయ లబ్ది కోసమే కుట్రలు చేస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పార్టీ ఫిరాయించిన 12మందిని కూడా విచారించాలి. పిరాయింపుల్లో అధికార దుర్వినియోగం జరిగింది. సబిత ఇంద్రారెడ్డికి మంత్రి పదవి, సుధీర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్, కాంతారావుకు విప్ పదవి, మరికొందరికి ఇతర లబ్ధి చేకూర్చారు. కోట్ల రూపాయలు చేతులు మారాయి. వీటీపై విచారణ చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది. తెలంగాణను అవమానించేలా కేసీఆర్ వ్యవహరించడం క్షమించరాని నేరం. అందుకే పార్టీకి బీఆరెస్ అని పెట్టారు.

శ్రీధర్ రెడ్డి మృతికి సంతాపం

తెలంగాణ ఉద్యమ తొలితరం నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి అకాల మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. శ్రీధర్ రెడ్డి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న గొప్ప నాయకులు, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా, శ్రీధర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఓయూ తొలిదశ 1969 ఉద్యమకారులు డాక్టర్ ఎం శ్రీధర్ రెడ్డి మృతి

సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి (STPS) నాయకులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి కన్నా ముందే తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని తట్టి లేపిన 1969 తొలి దశ ఉద్యమ వ్యవస్థాపకులు,ఓయూ అలుమిని సభ్యులు, ఓయూ Aహాస్టల్ నుండే తెలంగాణ ఉద్యమ జ్వాలలు దేశవ్యాప్తంగా ఎగ జిమ్మిన ఉద్యమనేత డాక్టర్ ఎం శ్రీధర్ రెడ్డి సోమవారం మద్యాహ్నం కేర్ బంజారా ఆసుపత్రిలో కన్నుమూశారు. రేపు మద్యాహ్నం 12గంటలకి జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా ఆయన సమకాలికులు టిపిసిసి ఉపాధ్యక్షులు కుమార్ రావు మరియు మలిదశ తెలంగాణ ఉద్యమనేత తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జెఏసి ఛైర్మన్ టిపిసిసి రాష్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ సోమవారం శ్రీధర్ రెడ్డి గారి మృతి తెలంగాణ రాష్ట్రానికి తీరనిలోట‌ని నిఖార్సైన తెలంగాణ పోరాట యోధుడు ని తెలంగాణ కోల్పోవడం బాదకరమని మానవతారాయ్ కొనియాడారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X