హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్ వద్ద సాంకేతిక లోపంతో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ దుర్మరణం చెందడం పట్ల టీపీసీసీ అధ్యక్షులు పార్లమెంట్ డిఫెన్స్ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
దేశం కోసం సైన్యంలో చేరి ప్రాణాలు అర్పించిన అనిల్ మరణం దేశానికి తీరని లోటు … ఆయన వీర మరణం పట్ల ప్రగాఢ సంతాపం. అనిల్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. అనిల్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ప్రభుత్వం అనిల్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి.
పొన్నం ప్రభాకర్ సంతాపం
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల జిల్లా బోయినిపెల్లి మండలం మల్లాపూర్ గ్రామాని పబ్బల్ల అనిల్ మృతి చెందారు. అనిల్ హెలికాప్టర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. వారి అకాల మృతి పట్ల వారికి నివాళి అర్పిస్తూ మా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబ సభ్యులకు మా సానుభూతిని తెలియచేస్తూన్నాము.
వాన్ మరణంపట్ల బండి సంజయ్ దిగ్ర్బాంతి
-కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన సంజయ్
-అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
జమ్మూకాశ్మీర్ లో హెలికాప్టర్ ప్రమాదంలో కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బ అనిల్ మరణించడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే బండి సంజయ్ కుమార్ అనిల్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి విలపిస్తున్న కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు యత్నించారు. అక్కడే ఉన్న జిల్లా నేతలతో మాట్లాడుతూ అనిల్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని ఆదేశించారు. అంతిమ సంస్కార ఏర్పాట్లతోపాటు తదుపరి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకోవాలని కోరారు.
వినోద్ కుమార్ సంతాపం
హైదరాబాద్ : జమ్మూ కాశ్మీర్ లో సైనికులు ప్రయాణించే హెలికాఫ్టర్ సాంకేతిక సమస్య ఏర్పడటంలో ప్రమాదానికి గురైన ఘటనలో రాజన్న సిరిసిల్ల జిల్లా,బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన జవాన్ పబ్బాల అనిల్ మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ బాధా తప్త సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ వారి కుటుంబ సభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
