హైదరాబాద్ : ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్, సీపీఐ నూతన ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, నెల్లికంటి సత్యంలు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలను సన్మానించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.
Also Read-
ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీలకు దిశ, దశ నిర్దేశించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధపు ప్రచారాలను ఎండగట్టి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయడంలో ముందుండాలని ఆయన సూచించారు. సీపీఐ మిత్రపక్షంగా సంపూర్ణ సహకారం అందించామని ఇదే మైత్రి కొనసాగాలని ఆయన సీపీఐ నాయకులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థులతో కలిసి లంచ్ (భోజనం) చేసిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.