ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ముగిసిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ భేటి, ఈ విషయాల పై చర్చ

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తో కొద్ది సేపటి క్రితం భేటి ముగిసింది. గంటన్నరకు పైగా సాగిన సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది.

ఈ నెల 16 లేదా 17 తేదీలలో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉండే అవకాశం ఉంది. పీఏసీ సమావేశంలో మెజారిటీ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీస్కొని 42 శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయానికి వచ్చిన నాయకులు.

బోర్డ్, కార్పొరేషన్ డైరెక్టర్ ల పోస్టల నియామకాలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని నిర్ణయం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన అంశాలు, వ్యూహాల గురించి చర్చ.

Also Read-

జనహిత పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిష్కారాలపై చర్చించిన నాయకులు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీస్కెళ్లాలనే అంశాలపైన చర్చించిన ఇరువురు నాయకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X