“ఎమ్మెల్సీ ఎన్నికల్లో రజాకార్ల రాజ్యం ఎందుకు వస్తుందో కిస్మత్ రెడ్డికి తెలియాలి”

  • కిషన్ రెడ్డి మగాడు అయితే రాష్ట్రానికి ఏం చేసిండో చెప్పే దమ్ముందా?
  • తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందనుకోవడం పగటి కల
  • ఎన్నిక‌లు రాగానే బీజేపీ బిఆర్ఎస్ పార్టీ ప్రేమ చిగురించ‌డం ప‌రిపాటిగా మారింది
  • ఎన్నికలు అయిపోగానే బద్ద శత్రువుల్లా బిజేపి బిఆర్ఎస్ నేతల డ్రామాలు
  • మీలాగా ర‌హ‌స్య ప్రేమ‌ను న‌డ‌ప‌డం మాకు మా పార్టీకి అల‌వాటు లేదు
  • కిషన్ రెడ్డి పొద్దున లేస్తే అక్బర్ ఉద్దీన్ ఓవైసీ జపం చేస్తారు. గత జన్మలో ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటా
  • బీజేపీ నేతలకు మతం తప్ప అభివృద్ధి పై ధ్యాస లేదు

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిస్మత్ రెడ్డి అలియాస్ కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నా.. ఇన్నేళ్ళ చరిత్రలో తెలంగాణకి చేసిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నిక‌లు రాగానే బీజేపీ బిఆర్ఎస్ పార్టీ ప్రేమ చిగురించ‌డం ప‌రిపాటిగా మారిందన్నారు.

ఎన్నికలు అయిపోగానే బద్ద శత్రువుల్లా బిజేపి బిఆర్ఎస్ నేతల డ్రామాలు ఆడుతున్నారని..మీలాగా ర‌హ‌స్య ప్రేమ‌ను న‌డ‌ప‌డం మాకు మా పార్టీకి అల‌వాటు లేదని తేల్చిచెప్పారు.25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంపీగా అంబర్ పేట నియోజక వర్గానికి ఏం చేశారని నిలదీశారు.శుక్రవారం ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, సీడబ్ల్యూసీ సభ్యులు వంశీ చంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకోవడం పగటి కలే అని ఎద్దేవా చేశారు.కిషన్ రెడ్డి మగాడు అయితే రాష్ట్రానికి ఏం చేసిండో చెప్పే దమ్ముందా? అని సవాల్ విసిరారు. నిధుల సంగతి దేవుడెరుగు..ఒక్కసారైనా ప్రధానిని కలిసి రాష్ట్ర అభివ్రుది గురించి మాట్లాడుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర మంత్రిగా 15 నెల్లలో రాష్ట్రానికి తెచ్చిన నిధులు ఎన్ని.. తెలంగాణ బిడ్డగా సిగ్గు అనిపించడం లేదా కిస్మత్ రెడ్డి అంటూ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు.

Also Read-

కిషన్ రెడ్డి పొద్దున లేస్తే అక్బర్ ఉద్దీన్ ఓవైసీ జపం చేయడం అలవాటుగా మారిందన్నారు.గత జన్మలో ఇద్దరు అన్నదమ్ములు అనుకుంటానని. బీజేపీ నేతలకు మతం తప్ప అభివృద్ధి పై ధ్యాస లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రజాకార్ల రాజ్యం ఎందుకు వస్తుందో కిస్మత్ రెడ్డికి తెలియాలన్నారు. కేంద్ర మంత్రిగా దిగజారుడు వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సన్నబియ్యం లాంటి చారిత్రాత్మక నిర్ణయాలు అమలు చేస్తుంటే ప్రభుత్వానికి కిషన్ రెడ్డి అడుగడుగునా అడ్డుపడుతున్నారు. సన్నబియ్యం పంపిణీ పై రాద్దాంతం చేసే బదులు.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేసి రేషన్ షాపుల్లో మోదీ ఫోటో పెట్టుకోండి. కులం మ‌తం పేరు చెప్పి ఇంకెన్నాళ్లు ప‌బ్బం గడుపుకోవాల‌ని చూస్తారు.

లోకల్ బాడీ ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్ పార్టీతో ర‌హ‌స్య‌ ఒప్పందం నిజం కాదా కిష‌న్ రెడ్డి అలియాస్ కిస్మ‌త్ రెడ్డి. సంఖ్యాబ‌లం లేని మీరు ఎవ‌రి ప్రేమ అండ‌దండ‌లు చూసుకుని పోటీ చేస్తున్నారు. మాకు సంఖ్యా బ‌లం లేదు కాబట్టే ఎన్నిక‌ల‌కు దూరంగా ఉన్నాం. రాజకీయ అవసరాల బట్టి లోకల్ బాడి ఎన్నికల్లో మద్దతు గురించి ఆలోచిస్తాం. కులం మతం రాజకీయాలకు కాలం చెల్లింది. ఎవరికి తొత్తుగా ఉండాల్సిన అవసరం మాకు లేదు. కాబట్టే మేము గత అసెంబ్లీ, లోక్‌సభ, ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాం.

సబర్మతి నది గురించి మాట్లాడే మీరు మూసి సుందరికరణకు ఎందుకు అడ్డుపడుతున్నారు. మెట్రో రైలు విస్తరణకు పట్టదు.విభజన హామీలు పట్టవు. రాష్ట్ర అభివ్రుది కోసం మేము మా సీఎం, మంత్రులు ప్రధానిని కలవడానికి వస్తారు మీరు సిద్ధమా. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు. HCu భూముల్లో పారిశ్రామిక అభివ్రుది జరిగితే యువతకు వేల ఉద్యోగావకాశాలు లభిస్తాయి.రాజకీయాలు పక్కన పెట్టీ రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సింది పోయి స్వార్థ కోసం విమర్శలు చేయడం సరికాదు. బీసీలపై చిత్త శుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నాకు ఎందుకు మీ పార్టీ నేతలు హాజరయలేదు.బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నేతలకు లేదు. బీసీ బిడ్డలైన ఈటల రాజేందర్, బండి సంజయ్ బీసీల 42 శాతం రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు. మ‌జ్లిస్ పార్టీని అడ్డుగా పెట్టుకుని మ‌తం పేరుతో రాజకీయ స్టంట్లు చేయ‌డం మీకు మీ పార్టీ నేత‌ల‌కు అల‌వాటుగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు,చర్యలు తప్పవు. ఫలానా వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి అనలేదు. రాజకీయ సమతుల్యం ఉండాలని కోరుకునే వ్యక్తి జానారెడ్డి.రాజకీయాల్లో దిగజారి మాట్లాడితే సహించేది లేదు. దిగజారుడు వ్యాఖ్యలకి నేను పూర్తిగా వ్యతిరేకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X