మహిళల ఉచిత బస్ ప్రయాణం పై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.
నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు టీపీసీసీ పిలుపు.
మహేష్ కుమార్ గౌడ్…
ఈ రోజు మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పట్ల అనుచితంగా మాట్లాడారు. మహిళలను కించపరుస్తూ బస్ లలో బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్స్ లు చేయండి అంటూ అత్యంత ఆవహేళన గా మాట్లాడారు.
తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమాన కరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు శుక్రవారంనాడు అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేయాలని టీపీసీసీ పిలుపు నిస్తుంది.
ఇది కూడ చదవండి-
ఈ నిరసన కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి.