हैदराबाद/अमरावती: शीर्ष माओवादी नेताओं में से एक जगन (काकुरी पंडन्ना) की मां सीतम्मा का निधन हो गया है। वह पिछले कुछ समय से बीमारी से जूझ रही थी। सीतम्मा की बीमारी के बारे में जानकारी मिलने के बाद पुलिस अधिकारी पिछले महीने उनके घर गए और इलाज में उसकी मदद की। वयोवृद्ध के कारण चल बसी।
जगन का गृहनगर एपी में अल्लूरी सीतारामाराजू जिले के गुडेमकोत्तावीधी मंडल के दुप्पीलवाड़ा पंचायत में कोम्मुलावाड़ा गांव है। जगन के माओवादी आंदोलन में शामिल होने के बाद से सीतम्मा अपने गृहनगर में रह रही हैं। पिछले महीने पुलिस ने उसके इलाज के लिए सहायता प्रदान की। जगन अपनी मां के अंतिम संस्कार में शामिल होने की सूचना के चलते पुलिस ने सतर्कता बढ़ा दी है।
రెడ్ సెల్యూట్! మావోయిస్టు అగ్రనేత జగన్ తల్లి కన్నుమూత
హైదరాబాద్/అమరావతి : మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన జగన్ (కాకూరి పండన్న) తల్లి సీతమ్మ కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకున్న పోలీసు అధికారులు గత నెల ఆమె ఇంటికి వెళ్లి వైద్య చికిత్సకు సాయం అందించారు. వయసు కూడా ఎక్కువ కావడంతో ఆమె నెల తిరగకుండానే కన్నుమూశారు.
జగన్ స్వగ్రామం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీలోని కొమ్ములవాడ గ్రామం. జగన్ ఉద్యమంలోకి వెళ్లినప్పటి నుంచి సీతమ్మ స్వగ్రామంలోనే ఉంటున్నారు. గత నెలలో ఆమె చికిత్స కోసం పోలీసులు సాయం అందించారు. తన తల్లి అంత్యక్రియలకు జగన్ హాజరవుతాడేమోనని పోలీసులు నిఘా పెంచారు.