हैदराबाद : उनकी फिल्में देखने और उनकी प्रशंसा करने वाले तेलुगु दर्शक जब किसी प्राकृति आपदा में फंस जाते हैं तो टॉलीवुड फिल्म हस्तियां हमेशा आगे रहते हैं। ऐसे टॉलीवुड सितारों ने बाढ़ पीड़ितों के साथ खड़े होने और यथासंभव मदद करने के लिए एक बार फिर अपना बड़ा दिल दिखाया है।
दोनों तेलुगु राज्यों में बाढ़ से जूझ रहे लोगों की मदद के लिए फिल्मी हस्तियां एक-एक करके दान की घोषणा कर रहे हैं। टॉलीवुड के स्टार नायक बालकृष्ण, एनटीआर, महेश बाबू ने एक-एक करोड़ रुपये की घोषणा की है। इसमें तेलंगाना को 50 लाख रुपये और आंध्र प्रदेश को 50 लाख रुपये सीएम राहत कोष के लिए दिये जाएंगे।
इसी क्रम में आंध्र प्रदेश के उपमुख्यमंत्री पवन कल्याण ने भी व्यक्तिगत रूप से एक करोड़ रुपये देने की घोषणा की। युवा हीरो सिधू जोन्नलगड्डा ने आंध्र प्रदेश के लिए 15 लाख और तेलंगाना के लिए 15 लाख कुल 30 लाख रुपये देने की घोषणा की है। साथ ही विश्वक सेन ने एपी और तेलंगाना को 5-5 लाख रुपये दान देने की घोषणा की है। निर्देशक त्रिविक्रम ने निर्माता एस.राधाकृष्ण और नागवंशीला के साथ मिलकर दोनों राज्यों के लिए 25-25 लाख रुपये देने की घोषणा की है।
Also Read-
प्रोड्यूसर अश्विनीदत एपी को 25 लाख रुपये देने का ऐलान किया है। युवा निर्देशक वेंकी अटलुरी ने तेलंगाना के लिए 5 लाख और एपी के लिए 5 लाख रुपये देने की घोषणा की है। अभिनेत्री अनन्या नागल्ला ने तेलुगु राज्यों के लिए ढाई-ढाई लाख रुपये देने की घोषणा की। मशहूर हस्तियों के बाढ़ पीड़ितों के मदद के लिए आगे आने से लोगों में काफी उत्साह है।
मेगास्टार चिरंजीवी की मदद
दूसरी ओर, मेगास्टार चिरंजीवी ने दोनों तेलुगु राज्यों के बाढ़ पीड़ितों के लिए एक करोड़ रुपये के देने की घोषणा की। चिरंजीवी ने एक्स पर इस बारे में पोस्ट किया है। आंध्र प्रदेश और तेलंगाना के मुख्यमंत्रियों के राहत कोष में प्रत्येक को 50-50 लाख रुपये देने की घोषणा की है। मेगास्टार ने लिखा कि तेलुगु राज्यों में बाढ़ के प्रभाव के कारण लोगों को होने वाली कठिनाइयाँ मुझे परेशान कर रही हैं। बाढ़ में अनेक लोगों की मौत हो जाना बहुत दुखद है। तेलुगु राज्यों के मुख्यमंत्रियों के निर्देशन में दोनों सरकारें स्थिति को सुधारने के लिए कड़ी मेहनत कर रही हैं। हम सभी को किसी न किसी तरह से राहत प्रयासों में शामिल होने की जरूरत है।
चिरंजीवी ने ट्विटर एक्स के माध्यम से कहा कि इस प्रक्रिया के हिस्से के रूप में मैं दोनों राज्यों में लोगों की राहत में मदद के लिए एक करोड़ रुपये (आंध्र प्रदेश और तेलंगाना सीएम राहत कोष में प्रत्येक को 50-50 लाख रुपये) योगदान की घोषणा कर रहा हूं। मैं भगवान से प्रार्थना कर रहा हूं कि यह गंभीर स्थिति जल्द ही समाप्त हो और सभी लोग खुशियाली से जीवन बितायें। चिरंजीवी की मदद पर प्रतिक्रिया देते हुए एपी के डिप्टी सीएम पवन कल्याण ने कहा, ”एक बड़ा भाई छोटे भाई के लिए मदद करना आपके बड़पन है। धन्यवाद।
तेलंगाना कर्मचारियों की मानवता, बाढ़ पीड़ितों के लिए 130 करोड़ रुपये देने का फैसला
तेलंगाना सरकार के कर्मचारियों ने इंसानियत दिखाई है। वे उन पीड़ितों के साथ खड़े हो गये जो पूरे तेलंगाना राज्य में बाढ़ के कारण बेघर हो गए हैं। अपने योगदान के तहत, उन्होंने सीएम रेवंत रेड्डी के राहत कोष में एक दिन का वेतन दान करने का फैसला किया है। इस तरह सीएम राहत कोष में 130 करोड़ रुपये दिए जाएंगे। इस संबंध में प्रस्ताव की प्रति शासन को भेज दी गई है।
उन्होंने कहा कि हाल ही में राज्य में लगातार बारिश और तूफान के कारण तेलंगाना के लोगों को भारी नुकसान हुआ है, हमने इस कठिन समय में उनकी मदद करने का फैसला किया है। तेलंगाना सरकार के कर्मचारियों ने सीएम से राजपत्रित अधिकारियों, शिक्षकों, कर्मचारियों, पेंशनभोगियों, अनुबंध और आउटसोर्सिंग कर्मचारियों के सितंबर के वेतन से एक दिन का मूल वेतन सरकारी खजाने में जमा करने की अपील की।
इस बीच पिछले कुछ दिनों से लगातार हो रही बारिश और बाढ़ से राज्य में हाहाकार मचा हुआ है। हर तरफ जनजीवन ठप्प हो गया है। खम्मम जिला विशेष रूप से बाढ़ से प्रभावित हुआ है। मुन्नरु नदी के उग्र होने से खम्मम के कई हिस्सों में पानी भर गया। बाढ़ का पानी घर में घुसने से सैकड़ों लोग सड़कों पर आ गये हैं। बाढ़ ने सैकड़ों परिवारों को अविस्मरणीय त्रासदी में छोड़ दिया है। पीड़ितों की मदद के लिए कई लोग आगे आ रहे हैं।
వరద బాధితులకు అండగా టాలీవుడ్
హైదరాబాద్ : తమ సినిమాలను చూసి ఆదరించి, అభిమానించే తెలుగు ప్రేక్షకులను ప్రకృతి విపత్తుల నుంచి ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్పుడూ ముందుంటారు. జనానికి అండగా నిలిచేందుకు, తమకు చేతనైనంత సాయం చేసేందుకు ముందుకొచ్చే టాలీవుడ్ స్టార్స్ మరోసారి తమ గొప్ప మనసును చాటుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా విరాళాలను ప్రకటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్, మహేష్ బాబు కోటి రూపాయలు ప్రకటించారు. ఇందులో తెలంగాణకు రూ.50 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.50 లక్షలు చొప్పున సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు.
అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగతంగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇక యువహీరోలు సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి 15 లక్షలు, తెలంగాణకు 15 లక్షలు చొప్పున ముప్ఫై లక్షలు అనౌన్స్ చేశాడు. అలాగే విశ్వక్ సేన్ ఏపీ, తెలంగాణకు 5 లక్షల చొప్పున విరాళం ప్రకటించాడు. నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, నాగవంశీలతో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ రెండు రాష్ట్రాలకు చెరొక 25 లక్షల చొప్పున 50 లక్షలు ప్రకటించారు.
నిర్మాత అశ్వినీదత్ ఏపీకి 25 లక్షల విరాళం అందజేస్తామన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెలంగాణకు 5 లక్షలు, ఏపీకి 5 లక్షలు చొప్పున ప్రకటించాడు. ఇక హీరోయిన్ అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాలకు చెరో రెండున్నర లక్షల చొప్పున ప్రకటించింది. ఆపదలో ఉన్న ప్రజల కోసం సెలబ్రిటీస్ ముందుకొచ్చి ఆపన్న హస్తం అందించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం
మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి రెండు రాష్ట్రాలకు కలిపి కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో 0 లక్షలు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది.
ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను” అని ట్విట్టర్ X ద్వారా తెలిపారు. చిరు చేసిన సాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..’ఆపద సమయంలో కూడా అన్నయ్య లాగా ఆదుకుని..మీ పెద్ద మనసు చాటుకున్నందుకు ధన్యవాదాలు అన్నయ్య’ అని అన్నారు.
తెలంగాణ ఉద్యోగుల మానవత్వం, వరద బాధితులకు రూ.130 కోట్లు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదల వల్ల నిరాశ్రయులైన బాధితుల పక్షం నిలిచారు. తమ వంతు సాయంగా మూల వేతనంలో ఒక రోజు జీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి సహాయ నిధికి అందజేయాలని నిర్ణయించారు. 130 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి తీర్మాన కాపీని పంపించారు.
ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలు, తుపాను ప్రభావంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నష్టాన్ని చవిచూశారని.. ఈ క్లిష్ట సమయంలో తమ వంతుగా వారిని ఆదుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్లు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒకరోజు మూలవేతనపు మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుండి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిందిగా సీఎంకు విజ్ఞప్తి చేశారు.
కాగా, గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలతో రాష్ట్రం అల్లకల్లోలం అయ్యింది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఎక్కువగా వరద ప్రభావానికి గురైంది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో ఖమ్మంలోని పలు ప్రాంతాల జలదిగ్భంధం అయ్యాయి. వరద నీరు ఇంట్లోకి చేరడంతో వందల మండి రోడ్డున పడ్డారు. వందల కుటుంబాలను వరదలు మరిచిపోలేని విషాదంలోకి నెట్టాయి. ఈ క్రమంలో బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. (ఏజెన్సీలు)