పేలిన డిటోనేటర్‌, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం

హైదరాబాద్‌ : నగర శివారులోని నార్సింగి వద్ద డిటోనేటర్‌ పేలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఔటర్‌ రింగ్‌ రోడ్డు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మూడు రోజుల క్రితం సంబంధిత కాంట్రాక్టర్‌ రోడ్డు పనుల్లో భాగంగా బండరాళ్ల మధ్య అమర్చిన మూడు డిటోనేటర్‌లో ఒకటి ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో బండరాళ్లు ఆకాశంలోకి ఎగిరి కిందపడడంతో అక్కడ పనిచేస్తున్న కొందరు భయాందోళనతో పారిపోగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. (Agencies)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

Archives

Categories

Meta

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X