हैदराबाद: केंद्रीय गृह राज्य मंत्री बंडी संजय कुमार ने तेलंगाना के लोगों से सोशल मीडिया पर चल रही उन अफवाहों पर विश्वास न करने की अपील की है कि तेलंगाना में पेट्रोल और डीज़ल की कमी है। उन्होंने तेलंगाना पेट्रोलियम डीलर्स एसोसिएशन की ओर से लोगों को याद दिलाया कि तेल कंपनियों के पास पेट्रोल और डीज़ल का काफ़ी भंडार है।
मंत्री संजय ने आगे कहा कि नरेंद्र मोदी के नेतृत्व में केंद्र सरकार लगातार तेल भंडारों पर नज़र रख रही है ताकि यह पक्का हो सके कि पेट्रोल और डीज़ल की कोई कमी न हो। उन्होंने कहा कि कुछ ताकतें बनावटी कमी पैदा करने और लोगों को परेशान करने की साज़िश कर रही हैं, और उन्होंने उनसे उन साज़िशों को नाकाम करने का सुझाव दिया। उन्होंने खास तौर पर वाहन चलाने वालों से अपनी रोज़ाना की ज़रूरतों के हिसाब से अनुशासन के साथ पेट्रोल और डीज़ल खरीदने की अपील की। इस बारे में बुधवार सुबह मीडिया को एक बयान जारी किया गया।
ఇది కూడ చదవండి-
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న వదంతులు నమ్మవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు విజ్ఝప్తి చేశారు. ఆయిల్ సంస్థల వద్ద సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయనే విషయాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.
పెట్రోలు, డీజిల్ కొరత రాకుండా నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్ నిల్వలపై పర్యవేక్షిస్తోందని తెలిపారు. కృత్రిమ కొరత స్రుష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని, ఆ కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. ముఖ్యంగా వాహనదారులు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే క్రమశిక్షణతో పెట్రోలు, డీజిల్ ను కొనుగోలు చేయాలని విజ్ఝప్తి చేశారు.ఈ మేరకు బుధవారం ఉదయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘అమెరికా, ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడిందంటూ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ఇండియన్ ఆయిల్, హెచ్ పీసీఎల్, బీపీసీఎల్ వంటి అన్ని పబ్లిక్ సెక్టార్ ఆయిల్ కంపెనీల వద్ద అవసరమైనంత స్టాక్ అందుబాటులో ఉంది. పెట్రోలు, డీజిల్ సరఫరాలోను లోపం లేదు. రాష్ట్ర అవసరాలకు సరిపడా పెట్రోలు, డీజిల్ సరఫరా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోషియేషన్ కూడా స్పష్టం చేసింది’’ అని తెలిపారు.
‘‘పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఉందనే పుకార్లను, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మి చాలా మంది పెట్రోలు బంకుల వద్దకు పరుగులు తీస్తూ ట్యాంకులు నింపుకుంటూ, అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరగడంవల్ల కొన్ని పెట్రోలు బంకుల్లో తాత్కాలిక స్టాక్ కొరత ఏర్పడుతోంది. దానివల్ల వాహనదారులకు ఇబ్బంది ఏర్పడే అవకాశాలున్నాయి. ఇదే అదనుగా కొంతమంది క్రుత్రిమ కొరత స్రుష్టించి బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే ప్రమాదం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వదంతులను నమ్మ వద్దని ప్రజలకు విజ్ఝప్తి చేస్తున్నా’’అని పేర్కొన్నారు.
‘‘ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ కొరత రాకుండా నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయిల్ నిల్వలపై పర్యవేక్షిస్తోంది. క్రుత్రిమ కొరత స్రుష్టించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలని కొన్ని శక్తులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వాహనదారులు రోజువారీ అవసరాలకు తగ్గట్లుగానే క్రమశిక్షణతో పెట్రోలు, డీజిల్ ను కొనుగోలు చేయాలని విజ్ఝప్తి చేస్తున్నా. తద్వారా పెట్రోల్ బంకుల్లో క్రుత్రిమ కొరత ఇబ్బందుల్లేకుండా యథావిధిగానే సరఫరా కొనసాగుతుంది’’అని తెలిపారు.
తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత ఉందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత ఉందనే వార్తలు ప్రచారం కావడంపై అసోసియేషన్ స్పందించింది.

హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల వద్ద సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని అసోసియేషన్ ధృవీకరించింది. రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందని, ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. విపరీతమైన రద్దీ కారణంగా కొన్ని బంకుల్లో తాత్కాలికంగా ఇంధన కొరత ఏర్పడిందని, దీనిని ఇంధన కొరతగా భావించవద్దని అసోసియేషన్ తెలిపింది. వినియోగదారులు పుకార్లను నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేసింది. ఇంధనం దొరకదన్న భయంతో బంకుల వద్దకు క్యూ కడుతున్నారని, నిల్వలు ఉంచుకునేందుకు ముందస్తు కొనుగోళ్లతో ఇబ్బంది ఏర్పడుతోందని అసోసియేషన్ తెలిపింది.
హైదరాబాద్ సహా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉన్న పెట్రోల్ బంకులు తెల్లవారుజాము నుంచే వాహనదారులతో రద్దీగా కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కట్టాయి. ఆటోలు, కార్లు, కంటైనర్లు కూడా పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి నిరీక్షిస్తున్నాయి. ఎవరి నోట చూసిన ఫుల్ ట్యాంక్ మాటే వినిపిస్తుండటంతో.. బంకుల్లో నిల్వ ఉన్న పెట్రోల్, డీజిల్ ఖాళీ అవుతుంది. మళ్లీ వాటిని నింపేందుకు సమయం పడుతుండటం వల్లే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సి వస్తోందని, తీవ్రమైన కొరత ఉందన్నది అవాస్తవమని బంకుల యజమాన్యాలు కూడా చెప్తున్నాయి. ఇంధన కొరత లేదని ఎంతచెప్తున్నా వాహనదారులు వినడం లేదని వాపోతున్నాయి.
