“తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదు”

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేదని తెలంగాణ మహిళా కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ సునీత రావు మండి పడ్డారు. రోజు రోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపొతున్న పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం ప్రగతి భవన్ ముట్టడించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడనీ ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ వల్ల అమాయక గిరిజన యువతి చనిపోతే, ఆమెకు రక్షణ కల్పించాలని తాము
ఓ పక్క మాట్లాడుతుంటే మంత్రి కే టి యార్ ప్రీతి ఘటన అదొక చిన్న విషయం అని, ప్రతి పక్షాలు దాన్ని రాద్దాంతం చేస్తున్నాయనీ వ్యాఖ్యానించాడన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

మంత్రి ktr కు మహిళా రక్షణ పై ఏ మాత్రం సోయి లేదన్నారు. ప్రగతి ముట్టడి సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళా కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వారిని అరెస్ట్ చేసి, గోషా మహాల్ స్టేడియానికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X