చదువులో గృహిణులను, ఖైదీలను యువత ఆదర్శంగా తీసుకోవాలి : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

మూక్స్ ద్వారా ఉపాధి నైపుణ్యాలతో అంబేద్కర్ వర్శిటీ ముందడుగు : ఇగ్నో వీ. సీ. ప్రొ. ఉమా కంజిలాల్
ప్రఖ్యాత గేయ రచయిత, కవి గోరటి వెంకన్న; విద్యావేత రచయిత, ప్రేమ్ రావత్‌ లకు గౌరవ డాక్టరేట్ ల ప్రధానం
బంగారు పతకం అందుకున్న ఇద్దరు ఖైదీలు
ఘనంగా అంబేద్కర్ వర్శీటీ 26వ స్నాతకోత్సవం

హైదరాబాద్ : విద్యను అభ్యసించడంలో, అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గృహిణులను, మహిళలను, ఖైదీలను ఆదర్శంగా తీసుకోవాలని తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ జిష్ణు దేవ్ వర్మ పేర్కొన్నారు. డా. బి ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఇరవై ఆరవ స్నాతకోత్సవం మంగళవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్, జిష్ణు దేవ్ వర్మ పాల్గొని ప్రసంగించారు. అయన మాట్లాడుతూ ప్రతిభ గల విద్యార్ధులకు అనేక అవకాశాలు ఉన్నాయని, అయితే విద్యార్ధికి చదువుతో పాటు ఇండస్ట్రీ కి అవసరమైన సాంకేతిక నైపుణ్యం, డిజిటల్ లిటరసీ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. డిజిటల్ విద్య, నైపుణ్య సాధికారత, విద్యార్ధులకు ఉపాధి కల్పనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

ఆదివాసీ, గిరిజన విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం అంటే సమాజంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్న ప్రయత్నం గొప్పదని ప్రశంసించారు. ట్రాన్స్ జెండర్ విద్యార్థులు, దివ్యాంగులకు ఉచిత స్కాలర్‌షిప్‌లు రాజ్యాంగ విలువలను కాపాడేలా ఉన్నాయన్నారు. ఉద్యోగం చేస్తూ చదువుకోవడం, గృహిణులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, పేద విద్యార్ధులు, ఖైదీలకు అంబేద్కర్ యూనివర్సిటీ ఓ గొప్ప అవకాశంగా గవర్నర్ అభివర్ణించారు. ఈ రోజు ఈ ప్రాంగణంలో ఉన్న విధ్యార్ధులతో పాటు ఖదీలు కూడా పట్టభద్రులు కావడం చాల సంతోషంగా ఉందని, ఇది వారిలో పరివర్తనకు నాంది కానుందని పేర్కొన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా, “లేవండి, మేల్కొంది, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి” అనే సూక్తిని గుర్తు చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు ఎదుగుతున్న తీరు ఇతర విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు.

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (న్యూఢిల్లీ) వైస్ ఛాన్స్‌లర్‌ ప్రొ. ఉమా కాంజీలాల్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ మారుతున్న ప్రస్తుత పరిస్తుతుల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక భూమిక పోషిస్తోందని, భారతదేశ విద్యా వ్యవస్థను రూపొందించడంలో దూర, డిజిటల్ విద్య (Online Distance Digital Learning) ఓ కీలక శక్తిగా మారిందన్నారు. దీని ద్వారా ఓ విద్యార్ధి తనకు నచ్చిన విద్యా సంస్థలో నచ్చిన కోర్సును అభ్యసించే వెసులు బాటు ఏర్పడిందని, నూతన జాతీయ విద్యా విధానం 2020 కూడా అదే సూచిస్తోంధన్నారు. మూక్స్ ద్వారా వర్చువల్ ల్యాబ్‌లు, కృత్రిమ మేధస్సు వంటి సాంకేతికతలను విస్తృత పరచడంలో ODDL కీలకం కానుందన్నారు. కరోనా వంటి మహమ్మారి దేశ విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేయగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అవలంభిస్తున్న ODL సిస్టం అందరికీ మార్గదర్శిగా నిలిచిందని, ఉన్నత విద్యా వ్యాప్తిలో డా. బి ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు.

ఈ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యా సంవత్సర వార్షిక నివేదికను సమర్పించారు. దేశంలోనే తొలిసారిగా రెగ్యులర్ యూనివర్సిటీలతో సమానంగా ఓడీఎల్‌లో సీబీసీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టగా కోర్సు పూర్తి చేసి విద్యార్థులు పట్టాలు అందుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ పరిధిలోని రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RASCI) తో ‘ఉపకారవేతనంతో కూడిన అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ (SAP) కోసం ఎంఓయూ కుదుర్చుకున్నామన్నారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ మాన్యుఫాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వెస్ట్ సైడ్, ‘పై’ ఇంటర్నేషనల్, అపోలో ఫార్మసీ వంటి ప్రముఖ సంస్థలు ఇందులో భాగస్వాములయ్యాయని వివరించారు.

మహిళా విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు, వ్యవస్థాపకత నైపుణ్యాల ద్వారా సాధికారత సాధించేందుకు ‘We Enable’ పేరుతో వీ హబ్ తో ఎంఓయూ కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తిచేయని పోలీస్ ఉద్యోగులు, ఉద్యోగంలో ఉండగానే తమ డిగ్రీ కోర్సులు పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంతో అవగాహన కుదుర్చుకొని రానున్న 5 సంవత్సరాల్లో పోలీస్ శాఖలో పని చేసే ప్రతీ ఉద్యోగి డిగ్రీ పూర్తి చేసుకునేల ప్రత్యేకంగా కోర్సును డిజైన్ చేశామని వెల్లడించారు. యూనివర్సిటీ విద్యార్థులు వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవడానికి అనుగుణంగా ‘శ్రీ రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్‌’ (SRTRI) తో ఎంఓయూ కుదుర్చుకొని దీనివల్ల దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌషల్ యోజన (DDU-GKY) ద్వారా అందిస్తున్న నైపుణ్య శిక్షణ కోర్సులు BRAOU విద్యార్థులకు అందుబాటులో ఉండేలా వృత్తి నైపుణ్య శిక్షణ మెళకువలను అందించనున్నట్లు వెల్లడించారు.

యూనివర్సిటీ అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధానంలో భాగంగా తెలంగాణలోని ట్రాన్స్ జెండర్ల కు ఉచిత డిగ్రీ కోర్సులు అందిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025-26) నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ఆదివాసీలైన గోండు, కోయ, చెంచు, ఇతర అభివృద్ధికి నోచుకోని గిరిజన తెగలకు ఉచిత విద్యను అందిస్తున్నామని ప్రొ. చక్రపాణి వెల్లడించారు. వికలాంగులకు ఉచిత విద్యను అందిస్తున్నామన్నారు.

ఎస్సీ సబ్ ప్లాన్ కింద BRAOU క్యాంపస్ లో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డైలాగ్ ఆన్ గవర్నెన్స్ అండ్ ఈక్విటీ (BRIIDGE) పేరుతో అంతర్జాతీయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. పీఎం – ఉష పథకం కింద యూనివర్సిటీ అభివృద్ధి కోసం యూజీసీ రూ.21,63,66,695 (21 కోట్ల 63 లక్షల 66 వేల 6 వందల 95 రూపాయలు) కేటాయించింది. ఈ నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్ల గ్రాంటు మంజూరు చేసింది.

Also Read-

గోరేటి వెంకన్న, ప్రేమ రావత్ లకు గౌరవ డాక్టరేట్ లు :

ఈ స్నాతకోత్సవంలో ప్రఖ్యాత గేయ రచయిత, కవి శ్రీ గోరటి వెంకన్న తెలుగు సాహిత్యానికి చేసిన సేవలకు అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాంతి విద్యా ప్రచారకులు, పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంపొందించి, నేరాల శాతం తగ్గించడానికి కృషి చేసిన రచయిత ప్రేమ్ రావత్‌ లకు ఆయా రంగాల్లో చేసిన సేవలకు గాను డాక్టర్ ఆఫ్ లెటర్స్ (హానరిస్ కాసా – గౌరవ డాక్టరేట్) లకు స్నాతకోత్సవ కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ లను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అందించారు. ఈ స్నాతకోత్సవంలో 60,288 మంది ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిగ్రీలు/ డిప్లొమాలు/సర్టిఫికెట్లు పొందేందుకు అర్హులైయ్యారన్నారు. డిగ్రీ (బి.ఎ/బి.కాం/బి ఎస్సి) కోర్సుల్లో 35,346 అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు; పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 24,942 అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఈ స్నాతకోత్సవంలో 32,373 మంది మహిళాలు పట్టభద్రులవులైయారు. అదేవిధంగా ఏడుగురు ట్రాన్స్‌జెండర్ అభ్యాసకులు తమ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. 55 మంది పిహెచ్‌డి మరియు ఇద్దరు ఎం.ఫిల్ పట్టాలను అందుకున్నారు.

ఈ స్నాతకోత్సవంలో మొత్తం 86 బంగారు పతకాలు (డిగ్రీ – 35, పీజిలో – 51) మహిళలకు 67, పురుషులు 19 బంగారు పతకాలు అందుకున్నారు. అలాగే 4 బుక్ ప్రైజ్ లు ప్రదానం చేశారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 203 మంది ఖైదీలు డిగ్రీ పూర్తి చేసుకున్నారని. ఇందులో ఇద్దరు ఖైదీలకు గోల్డ్ మెడల్స్ లభించాయి – (డిగ్రీ 1 & పీజి 1) ఇద్దరు ఖైదీలకి బుక్ ప్రైజ్ లు అందించారు. దొప్పలపూడి నాగరాజ కుమారి అడ్మిషన్ నెంబర్. 0742144276 (సెంట్రల్ జైలు రాజమండ్రి), గుణకల్ యుగంధర్ (డిగ్రీ అడ్మిషన్ నెంబర్. 1662049651 & పీ.జీ అడ్మిషన్ నెంబర్: 16621081436 (సెంట్రల్ జైలు, కడప). ఈ స్నాతకోత్సవంలో పలువురు విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా IAS, అన్ని విభాగాల డీన్ లు, డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీలో బంగారు పతకాలు, పుస్తక ప్రైజ్ లు పొందిన వారి వివరాలు :

• షేక్ సుహనర్మిన్ (అడ్మిషన్ నెంబర్. 1002148419) మూడు బంగారు పతక విజేత.
• విన్నకోట నిరంజని (అడ్మిషన్ నెంబర్. 1002062964) మూడు బంగారు పతక విజేత.
• ధంతమ్ సంధ్య (అడ్మిషన్ నెంబర్. 1902138089) మూడు బంగారు పతక విజేత.
• పగిల్లా లిఖిత (అడ్మిషన్ నెంబర్. 0102119206) రెండు బంగారు పతక విజేత.
• బడితల కామాక్షి సుశ్రుత (అడ్మిషన్ నెంబర్. 1592068233) రెండు బంగారు పతకాలను గెలుచుకుంది.
• వి.మనోహర్ (అడ్మిషన్ నెంబర్. 0652044418) రెండు బంగారు పతకాలను గెలుచుకున్నారు.
• యానాది గీతా ప్రియ (అడ్మిషన్ నెంబర్. 0412043232) రెండు బంగారు పతకాలను గెలుచుకుంది.

పీజీలో బంగారు పతకాలు అందుకన్నవారు :

• మహ్మద్ షాహిన్బేగం (అడ్మిషన్ నెంబర్. 00722280626) రెండు బంగారు పతక విజేత
• హన్నా షీబా (అడ్మిషన్ నెంబర్. 22822071327) రెండు బంగారు పతకాల విజేత
• కేంసారం రేవతి (అడ్మిషన్ నెంబర్. 22820017275) రెండు బంగారు పతకాల విజేత
• మెంటా రాజేశ్వరి (అడ్మిషన్ నెంబర్. 00321017609) రెండు బంగారు పతకాల విజేత
• రాజు సాయి శరణ్య (అడ్మిషన్ నెంబర్. 00322010055) రెండు బంగారు పతక విజేత
• రవికుమార్ అవ్వరి (అడ్మిషన్ నెంబర్. 00521040254) రెండు బంగారు పతక విజేత
• సరిత జి (అడ్మిషన్ నెంబర్. 00321280207) రెండు బంగారు పతక విజేత
• ఉమాకుమారి కొమ్మాల జి (అడ్మిషన్ నెంబర్. 01923072005) రెండు బంగారు పతకాల విజేత
• వెంకటలక్ష్మి చెరుకూరి (అడ్మిషన్ నెంబర్. 01422034396) రెండు బంగారు పతకాల విజేత
• స్మృతిప్రజ్ఞ గిరి (అడ్మిషన్ నెంబర్. 01922022929) ఒక బంగారు పతకం మరియు ఒక పుస్తక బహుమతి గ్రహీత

THE ARTIFICIAL INTELLIGENCE ERA WHICH BRINGS NOT ONLY CHALLENGES BUT ALSO GREAT OPPORTUNITIES: Governor Jishnu Dev Verma

Open, Distance, and Digital Learning (ODDL) has become transformative: IGNOU VC Prof. Uma Kanjilal

Gorati Venkanna and Prem Rawat Conferred Honorary Doctorates

Hyderabad: The twenty-sixth convocation of Dr. B.R. Ambedkar Open University was held in the University campus on Tuesday. Jishnu Dev Verma, Governor of Telangana and Chancellor of the University addressed the Twenty Sixth Convocation.

He said that the Industry demands adaptability, communication, teamwork, and digital skills, not just facts. BRAOU’s efforts in digital learning and skill empowerment are nation-building steps. I commend BRAOU’s SAMATHA initiative, giving free ship to Adivasi students, promoting equity. Free ships to transgender students and divyangjan affirm dignity and inclusion, reflecting constitutional values. I encourage you to pursue lifelong learning through new courses and certifications. We are entering the AI era, which brings not only challenges but also great opportunities.

Embrace technology, but keep creativity, empathy, and ethics at your core. Many of you balanced studies with work, family, and hardships—your success proves your strength. BRAOU opens doors to all — working professionals, homemakers, senior citizens, differently-abled learners, and even prison inmates. To the inmate graduates here today, your education is a powerful story of transformation and hope. To our Armed Force members, your pursuit of knowledge alongside service is truly admirable. Education at BRAOU is a right for all, not just a privilege for few. Remember, life without goals is like a ship without a compass. Set meaningful goals that serve society.
As Swami Vivekananda said, “Arise, awake, and stop not till the goal is reached.” Success is perseverance, courage, and belief in yourself—it’s a journey, not a destination. Your background does not define you—your choices do. Many BRAOU alumni are inspiring leaders today. Your degree carries the legacy of Dr. B. R. Ambedkar, a symbol of education’s power to transform.

Prof. Uma Kanjilal, Vice-Chancellor, Indira Gandhi National Open University, New Delhi was the chief guest and delivered the Convocation address. She said the Open, Distance, and Digital Learning (ODDL) has, in recent years, become a transformative force in shaping India’s education system. ODDL has expanded the reach of equity and opportunity, embodying the spirit of the National Education Policy 2020, which emphasizes flexibility, multiple entry-exit pathways, and lifelong learning. By integrating technologies like MOOCs, virtual labs, and artificial intelligence, ODDL is equipping learners with employable skills, helping India progress towards a higher Gross Enrolment Ratio and advancing the Sustainable Development Goals.

It has proven to be resilient even in times of crisis, such as during the pandemic. Far from being a supplementary model, ODDL is now a mainstream channel of knowledge, one that strengthens India’s education system while preparing citizens for the challenges of the future. In today’s rapidly evolving knowledge society, distance and digital education are central to advancing inclusive and lifelong learning. With emerging tools like AI-powered platforms, adaptive learning systems, and digital classrooms, institutions like BRAOU stand at the forefront of India’s educational transformation.

Prof. Ghanta Chakrapani, Vice-chancellor presided over the Convocation. Prof. Chakrapani presented a detailed report. At this Convocation the University conferred the Degree of Doctor of Letters (D.Litt) Honoris Causa on Gorati Venkanna an extraordinary lyricist and poet for his notable contribution to Telugu Literature and on Sri Prem Rawat, Global Peace Educator, who is working to increase student enrollment in schools in a healthy manner and reduce crime rates worldwide.

Prof. Chakrapani said that at this convocation 60,288 Degrees, Diplomas and Certificates are being awarded. 35,346 degrees in the Undergraduate programs while 24,942 degrees in the Post Graduate Programs are being awarded. Notably, Seven (07) Transgender learners received their degrees. 55 Ph.Ds and 02 M.Phil Research Scholars received their research degrees.

Gold Medals and Book Prizes:

A total of 86 gold medals (Degree – 35, PG – 51) were awarded in this graduation ceremony, 67 for women and 19 for men. In the degree, women won 29 gold medals and men won 6 gold medals. In PG, women won 38 and men won 13 gold medals and 4 book prizes were awarded.

A total of 203 inmates completed their degrees during 2023-24 from Central Prison Cherlapalli, Central Prison Rajamundry and Central Prisons Kadapa & Nellore in this convocation. An interesting aspect of this convocation is that 183 male and 20 female students were among those who received their degrees 168 Under graduate Degrees (Male : 149 and Female : 19) and 35 Post graduate Degrees (Male : 34, and Female : 01). Two prisoners were awarded Gold Medals – (Degree 1 & PG 1). 2 prisoners got book prize in U.G / P.G. Doppalpudi Nagaraja Kumari Admn. No. 0742144276 (Central prison Rajahmundry). Gunakal Yugandhar (U.G. Admn. No. 1662049651 & P.G. Admn. No: 16621081436 (Central Prison, Kadapa). Dr. Yogita Rana, IAS, Principal Secretary, Education attended the convocation in her capacity as the Executive Council member of the University.

MULTIPLE GOLD MEDAL AWARDEES LIST: U. G. PROGRAMMES

• Shaik Suhanarmin (Admn.No. 1002148419) winner of three Gold Medals.
• Vinnakota Niranjani (Admn.No. 1002062964) winner of three Gold Medals.
• Dhantham Sandhya (Admn.No. 1902138089) winner of three Gold Medals.
• Pagilla Likhitha (Admn.No. 0102119206) winner of Two Gold Medals.
• Badithala Kamakshi Susrutha (Admn. No. 1592068233) winner of Two Gold Medals.
• V Manohar (Admn. No. 0652044418) winner of Two Gold Medals.
• Yanadi Geetha Priya (Admn. No. 0412043232) winner of Two Gold Medals.

P. G. PROGRAMMES

• Mohammad Shahinbegum (Admn. No. 00722280626) winner of Two Gold Medals.
• Hanna Sheeba (Admn.No. 22822071327) winner of Two Gold Medals.
• Kemsaram Revathi (Admn. No. 22820017275) winner of Two Gold Medals.
• Menta Raajeswari (Admn. No. 00321017609) winner of Two Gold Medals.
• Raju Sai Saranya (Admn. No. 00322010055) winner of Two Gold Medals.
• Ravikumar Avvari (Admn. No. 00521040254) winner of Two Gold Medals.
• Saritha G (Admn. No. 00321280207) winner of Two Gold Medals.
• Umakumari Kommala G (Admn. No. 01923072005) winner of Two Gold Medals.
• Venkatalakshmi Cherukuri (Admn. No. 01422034396) winner of Two Gold Medals
• Smrutiprajna Giri (Admn. No. 01922022929) winner of one Gold Medal and One Book prize.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Recent Comments

    Archives

    Categories

    Meta

    'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

    X