हैदराबाद: तेलंगाना में पंचायत चुनाव के तीसरे फेज़ के लिए वोटिंग शांतिपूर्वक जारी है। सुबह 7 से दोपहर 1 बजे तक वोटिंग होगी। तीसरे फेज़ में 182 मंडलों में कुल 4,159 ग्राम पंचायतों के लिए नोटिफिकेशन जारी किया गया। इनमें से 394 पंचायतों और 7,908 वार्डों में बिना किसी विरोध के चुनाव हुए। 11 ग्राम पंचायतों और 116 वार्डों में एक भी नामांकन दाखिल नहीं हुआ।
इस समय 3,752 ग्राम पंचायतों और 28,410 वार्डों के लिए चुनाव हो रहे हैं। सरपंच पद के लिए 12,652 और वार्ड मेंबर पद के लिए 75,725 उम्मीदवार अपनी किस्मत आजमा रहे हैं। लंच ब्रेक के बाद दोपहर 2 बजे वोटों की गिनती शुरू होगी।

तीसरे फेज़ के मतदान के लिए 36,483 पोलिंग स्टेशन बनाए गए हैं। 3,547 सेंटरों पर वेबकास्टिंग की जा रही है। 4,502 आरओ, 77,618 पोलिंग स्टाफ, 2,489 माइक्रो ऑब्जर्वर और 43,856 बैलेट बॉक्स उपलब्ध कराए गए हैं। 3 दिन पहले से ही बीएलओ घर-घर जाकर वोटर स्लिप बांटे हैं। पुलिस ने शांतिपूर्ण चुनाव सुनिश्चित करने के लिए कड़ी सुरक्षा व्यवस्था की है।

ताजा समाचार के अनुसार, सुबह 9 बजे तक 24 फीसदी मतदान हुआ है। अधिकारियों ने बताया कि तीसरे चरण में महिला वोटर्स हैं।
మూడో విడత పంచాయతీ ఎన్నికలు
హైదరాబాద్ : తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. మూడో విడతలో 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
మూడో విడత పోలింగ్ కోసం 36,483 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. 4,502 మంది ఆర్వోలు, 77,618 మంది పోలింగ్‌సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 43,856 బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులో ఉంచారు. పోలింగ్‌కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటా తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. (ఏజెన్సీలు)
