దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలి, ఆదానీ బారి నుంచి కాపాడుకుందాం

దేశాన్ని బీజేపీ కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగించాలి, దేశాన్ని ఆదానీ బారి నుంచి కాపాడుకుందాం.. హన్మకొండ డిసిసి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి

హైదరాబాద్ : ఏఐసిసి/టిపిసిసి ఆదేశాల మేరకు ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై పార్లమెంట్ లో ఎంపీగా అనర్హత వేటు వేసిన అంశంపైన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ… దేశంలో ప్రజలు ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్స్ సహజ వనరులను కొల్లగొట్టారని, నేడు బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సూరత్ నుండి అదానీ కంపెనీ బయలుదేరిందన్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, దేశ సహజ వనరులను బ్రిటీష్ జనతా పార్టీ అదానీకి కట్టబెడుతుందని ఆయన ఆరోపించారు. ఆదానీ ముసుగులో బీజేపీ దేశాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందని రాహుల్ అప్పుడే చెప్పారన్నారు.

హిండెన్ బర్గ్ నివేదికతో మోదీ, ఆదానీ బండారం బయటపడిందని తెలిపారు. మోదీ, అమిత్ షా లు డొల్ల కంపెనీలతో ఆదానీ కంపెనీలు పెట్టుబడులు పెట్టారని, దీనిపై ఈడీ విచారణ చేయాలని ఫిర్యాదు చేసేందుకు వెళితే రాహుల్ ను అడ్డుకున్నారని గుర్తు చేశారు. పార్లమెంటులో అక్రమాలపై చర్చించాలని పట్టుబడితే రాహుల్ పై రాజకీయ కక్షతో అనర్హత వేటు వేశారని చెప్పారు.

ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక భయందోలనకు గురై నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రధానమంత్రి, కేబినేట్ మంత్రులు, మొత్తం వ్యవస్థ కలిసి ఒక వ్యక్తిని (ఆదానీ) కాపాడటానికి ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తున్నరనేది ప్రజలు ఆలోచించాలి, ఆదానిపై నిలదీసినందుకే ఆదరబాదరాగా రాహుల్ పై అనర్హత వేటు వేశారన్నారు. రాహుల్ గాంధీని చూసి మోదీ ఎంత భయపడుతున్నారో అర్ధమవుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ & పిసిసి సభ్యులు నమిండ్ల శ్రీనివాస్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి కూచన రవళి, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పి. రామకృష్ణ, గ్రేటర్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుంటి స్వప్న, AIPC అద్యక్షులు డాక్టర్ పులి అనిల్ కుమార్, ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, INTUC జిల్లా అద్యక్షుడు కూర వెంకట్, బ్లాక్ ప్రెసిడెంట్ అంబేద్కర్ రాజు,

యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పల్లె రాహుల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వెస్ట్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ తోట పవన్, NSUI జిల్లా అద్యక్షుడు పల్లకొండ సతీష్, నాయకులు తౌటం రవీందర్, పులి రాజు, బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, ఇప్పా శ్రీకాంత్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బంక సంపత్, మహమ్మద్ అంకుష్, మేకల ఉపేందర్, MV సమత రాజు, నాగపురి లలిత, బొంత సారంగం,టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి ఎం.డి ముస్తాక్ నెహాల్, జిల్లా సోషల్ మీడియా కో. ఆర్డి నేటర్ కేతిడి దీపక్ రెడ్డి, నాయకులు రేహమతుల్ల, అరూరి సాంబయ్య, కొండా శివ, క్రాంతి భరత్, డివిజన్ అద్యక్షులు, మండల పార్టీ అద్యక్షులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

'तेलंगाना समाचार' में आपके विज्ञापन के लिए संपर्क करें

X